ఇద్దరు ధరించాలి హెల్మెట్... లేదంటే పెరిగిపోతుంది ఫైన్ రేట్..

ఇద్దరు ధరించాలి హెల్మెట్... లేదంటే పెరిగిపోతుంది ఫైన్ రేట్..
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య ఎక్కువై పోతున్నాయి. చాలా వరకు ద్విచక్ర వాహనాల మీద ప్రయాణించే వారే తమ ప్రాణాలను కోల్పోతున్నారు. దీంతో హెల్మెట్...

ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య ఎక్కువై పోతున్నాయి. చాలా వరకు ద్విచక్ర వాహనాల మీద ప్రయాణించే వారే తమ ప్రాణాలను కోల్పోతున్నారు. దీంతో హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలంటూ ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. అయినప్పటికీ మరణాల సంఖ్యను తగ్గించలేక పోతున్నారు. ఆక్సిడెంట్ జరిగినపుడు ద్విచక్ర వాహనం ముందున్న వ్యక్తి గాయాలతో బయటపడినప్పటికీ, వెనక కూర్చున్న వ్యక్తి ప్రాణాలను కోల్పోతున్నారు. అందువల్ల బైక్‌పై వెళ్లే ఇద్దరూ హెల్మెట్ తప్పని సరిగా పెట్టుకోవడమే మంచిదని అంటున్నారు పోలీసు శాఖ వారు. దీన్ని విసృతం చేసే దశలో సైబరాబాద్ పోలీసులు కొత్త రూల్స్ ను తీసుకువస్తున్నారు.

ఇక పోతే రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మూడు కమిషనరేట్లు ఉండగా, ఇప్పటికే రాచకొండ కమిషనరేట్ పరిధిలో వాహణంపై ప్రయాణించే ఇద్దరు హెల్మెట్ ధరించే పద్ధతి అమలవుతోంది. అంతే కాక ఈ రోజునుంచి సైబరాబాద్ పరిధిలోనూ ఈ రూల్ అమల్లోకి తీసుకువస్తున్నారు. గత వారం రోజులుగా రాచకొండ పరిధిలో ఈ రూల్ పాటించని వారిపై 263 కేసులు నమోదయ్యాయి. వారి నుంచి దాదాపుగా రూ.28,400 జరిమానాను వసూలు చేశారు. ఇప్పుడు సైబరాబాద్ లోనూ ఈ రూల్ ప్రవేశపెట్టటడంతో పట్టణ ప్రజలు తప్పకుండా దీన్ని పాటించాల్సిందే.

ఎవరైనా ఈ రూల్ ని కాదని హెల్మెట్ ధరించకుండా ప్రయాణిస్తే వారికి భారీ మొత్తంలో జరిమానా విధించక తప్పదని పోలీసులు తెలుపుతున్నారు. ఎవరైనా రోడ్డుపైన లిఫ్ట్ ఎక్కించుకున్నా వారికి కూడా జరిమానా విధిస్తామని తెలుపుతున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories