అమీర్‌పేట్-హైటెక్‌సిటీ మార్గంలో మెట్రో రైళ్లు ప్రారంభం

అమీర్‌పేట్-హైటెక్‌సిటీ మార్గంలో మెట్రో రైళ్లు ప్రారంభం
x
Highlights

ఇప్పటికే పలు మార్గాల్లో మెట్రో రైలు పరుగులు తీస్తోంది.. ఇప్పుడు మరో మార్గానికి మెట్రో రైలు అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టులో...

ఇప్పటికే పలు మార్గాల్లో మెట్రో రైలు పరుగులు తీస్తోంది.. ఇప్పుడు మరో మార్గానికి మెట్రో రైలు అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టులో అత్యంత కీలకమైన అమీర్‌పేట-హైటెక్‌సిటీ మార్గంలో కమిషనర్ ఆఫ్ మెట్రోరైల్ సేఫ్టీ (సీఎంఆర్‌ఎస్) రైళ్లు నడుపడానికి అనుమతిచ్చింది. శుక్రవారం మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. అమీర్‌పేట నుంచి హైటెక్‌సిటీ వరకు గల పది కిలోమీటర్ల మార్గాన్ని గత ఏడాది సిద్ధంచేశారు. నవంబర్ 27న ట్రయల్న్ ప్రారంభించారు.

ప్రస్తుతం రోజూ ట్రయల్ రన్ జరుగుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ , మాదాపూర్, హైటెక్‌సిటీ ప్రాంతాల్లో పెద్దఎత్తున సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో చాలామంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరు నగరంలోని వివిధ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. రోజూ తమ ఆఫీసులకు వచ్చివెళ్లేందుకు ట్రాఫిక్‌లో ఇబ్బందులు పడుతున్నారు.దీంతో అమీర్‌పేట్-హైటెక్‌సిటీ మార్గం లో రైళ్లు ప్రారంభం కానున్నాయి. ఇది చాలా మంది ప్రైవేటు ఉద్యోగులకు ఉపయోగకరంగా ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories