హైదరాబాద్ మెట్రో వినూత్న ప్రయత్నం.. మెట్లపై కేలరీల వివరాలు...

హైదరాబాద్ మెట్రో వినూత్న ప్రయత్నం.. మెట్లపై కేలరీల వివరాలు...
x
Highlights

ప్రస్తుతం జంక్ ఫుడ్ ప్రభావం వలన చాలా మంది ఫ్యాట్ గా తయారవుతున్నారు. అంతే కాదు వారు ఎక్కువగా కూర్చినే వర్క్ చేయడం వలన క్యాలరీలు కరగకుండా ఇంకా లావయిపోతున్నారు.

ప్రస్తుతం జంక్ ఫుడ్ ప్రభావం వలన చాలా మంది ఫ్యాట్ గా తయారవుతున్నారు. అంతే కాదు వారు ఎక్కువగా కూర్చినే వర్క్ చేయడం వలన క్యాలరీలు కరగకుండా ఇంకా లావయిపోతున్నారు. అంతే కాదు ఇంట్లో పనులు చేయడానికి కూడా అన్నీ మిషనరీస్ రావడంతో శరీరానికి వ్యాయామం లేకుండా పోతుంది. దీంతో ఎన్నో ఆరోగ్య సమస్యలను, స్థూలకాలయ సమస్యలను ఎదర్కోవలసి వస్తుంది. కొంత మంది మాత్రం ఎదో ఒక విధంగా తమ ఒంట్లో ఉన్న క్యాలరీలను ఖర్చు చేయడానికి వాకింగ్, జాగింగ్, వర్కవుట్లు చేస్తూ ఉంటారు.

ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ మెట్రో రైలు ఓ వినూత్న ఆలోచనను చేపట్టింది. తాజాగా మరో సరికొత్త ఆకర్షణీయ ప్లాన్ అమలు చేశారు. నిజానికి ఈ లిఫ్టులను ముసలివారు, దివ్యాంగుల కోసం మెట్రో రైలు ఏర్పాటు చేసింది. కానీ మెట్రో రైలు ఎక్కేందుకు వస్తున్న వారు చాలా మంది లిఫ్ట్ సౌకర్యాన్ని వాడుకుంటున్నారు. లేదా ఎక్స్ లేటర్ ఎక్కి ఫ్లాట్ఫాంపైకి వెలుతుంటారు. కానీ మెట్లు ఎక్కడం వల్ల బాడీలో ఎన్ని కేలరీలు కరుగుతాయో ప్రయాణికులకు తెలపే విధంగా మెట్లపైనే క్యాలరీల వివరాలను ఇచ్చారు.

ఎన్ని మెట్లు ఎక్కితే ఎన్ని క్యాలరీలు ఖర్చుఅవుతాయో తెలుపుతున్నారు. దీంతో ప్రయాణికులు కూడా ఆకర్షిస్తున్నారు. ఈ ఐడియాని సిటీలోని రాయ్‌దుర్గ్ మెట్రో స్టేషన్‌లో అమలు చేసారు. స్టేషన్ మెట్లపై ఒక్క మెట్టుకు ఒక్కో కలర్ వేసి వాటిపై కేలరీల వివరాలు ఇచ్చారు. దీంతో ఎన్ని మెట్లు ఎక్కితే ఎన్ని క్యాలరీలు ఖర్చు అవుతున్నాయో తెలిసిపోతుంది. అధిక బరువు ఉన్నవారు, కేలరీలు తగ్గించుకోవాలి అనుకుంటున్నవారికి ఈ మెట్లపై వివరాలు ఎంతో మేలు చేస్తున్నాయి.

మెట్రో చేసిన ఈ ఫలితం సఫలం అయి ఇప్పుడు చాలా మంది మెట్లు ఎక్కి పై స్టేషన్‌కు వెళ్తున్నారు. అంతే కాదు ప్రతి స్టేషన్ లోనూ ఇదే ప్లాన్ అమలు చేయాలని ప్రయాణికులు చెపుతున్నారు. దీంతో అధికారులు కూడా ఇప్పుడు ఈ విధానాన్ని అన్ని స్టేషన్లలో అమలు చేయబోతున్నారు. అంటే త్వరలో అన్ని మెట్రో స్టేషన్లలో మెట్లు ఇలా కలర్‌ఫుల్‌గా మారిపోతాయన్నమాట.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories