రికార్డు సృష్టించిన హైదరాబాద్ మెట్రో..ఒక్క రోజులోనే..

రికార్డు సృష్టించిన హైదరాబాద్ మెట్రో..ఒక్క రోజులోనే..
x
హైదరాబాద్ మెట్రో
Highlights

మహానగరానికి మణిహారంగా ఉన్న మెట్రోట్రైన్ నూతన సంవత్సరంలో కొత్త రికార్డును సృష్టించింది.

మహానగరానికి మణిహారంగా ఉన్న మెట్రోట్రైన్ నూతన సంవత్సరంలో కొత్త రికార్డును సృష్టించింది. బుధవారం ఒక్క రోజే సుమారు 4.60 లక్షల మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేర్చింది. పెరుగుతున్న ట్రాఫిక్‌కి ప్రత్యమ్నాంగా ప్రారంభించిన మెట్రో అనుకున్న అంచనాలను మించిపోతుంది. ప్రయాణికును దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు కొత్త విధానాలను ప్రవేశపెడుతుంది. ఈ నేపథ్యంలోనే కొత్త సంవత్సరం సందర్భంగా మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్‌ఎంఆర్‌ఎల్) అధికారులు మెట్రో సమయాలను పొడగించారు. ప్రయాణికుల సౌకర్యార్థం తెల్లవారుజాము 2 గంటల వరకు నడిపించారు. దీంతో అధిక శాతంలో ప్రయాణికులు తమ గమ్యాన్ని చేరుకోవడానికి మెట్రోను ఎంచుకున్నారు.

హెచ్‌ఎంఆర్‌ఎల్ అధికారుల తెలిపిన వివరాల ప్రకారం సాధారణ రోజులతో పోల్చుకుంటే 40,000 మంది ప్రయాణికులు మెట్రో సేవలను అధికంగా ఉపయోగించుకున్నారన్నారు. గతేడాది అంటే 2019 చివరి నాటికి మెట్రోలో 4.60 లక్షల మంది ప్రయాణించారన్నారని తెలిపారు. నగరంలో అన్ని మెట్రో స్టేషన్లకంటే కూడా అమీర్ పేట్ మెట్రోస్టేషన్ నుంచి అధిక సంఖ్యలో ప్రయాణికులు ప్రయాణిస్తారని వారు తెలిపారు. అమీర్ పేట్ స్టేషన్ నుంచి సగటున 28,696 మంది ప్రయాణికులు ట్రైన్ ఎక్కగా, 25,548 మంది ప్రయాణికులు దిగుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories