హైదరాబాద్ మెట్రో రైలు సరికొత్త రికార్డు

హైదరాబాద్ మెట్రో రైలు సరికొత్త రికార్డు
x
Highlights

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇంతకీ ఆ రికార్డు ఏంటి..? ఆర్టీసీ సమ్మె‌ మెట్రోపై ఎలాంటి ప్రభావం...

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇంతకీ ఆ రికార్డు ఏంటి..? ఆర్టీసీ సమ్మె‌ మెట్రోపై ఎలాంటి ప్రభావం చూపిస్తోంది..? దీనిపై మెట్రో రైల్ అధికారులు ఏమంటున్నారు..?

హైదరాబాద్ మెట్రో రైలు సరి కొత్త రికార్టు సృష్టించింది. సోమవారం ఒక్క రోజే 4 లక్షల మందికి పైగా ప్రయాణించారు. మెట్రో ప్రారంభమైన నాటి నుంచి ఇదే అత్యధికమని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి వెల్లడించారు. ఆర్టీసీ సమ్మె ప్రభావంతో మెట్రో‌ రైళ్లలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగిందని అంటున్నారు.

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో అదనపు సర్వీసులను నడుపుతున్నారు. ప్రతి 3.5 నిమిషాలకు ఒక రైలు అందుబాటులోకి వస్తోంది. సోమవారం ఒక్క రోజే 830 ట్రిప్పులు నడిపారు. రోజు నడిచే రైళ్లతో పాటు అదనంగా 4 రైళ్లు 120 ట్రిప్పులు తిరిగాయి. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో భాగ్యనగరంలో ప్రజలు మెట్రో రైలును సరైన ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు.

ఆర్టీసీ కార్మికులకు సంఘీభావంగా తెలంగాణ కాంగ్రెస్ సోమవారం ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో సికింద్రాబాద్ - బేగంపేట మార్గంలో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు తమ గమ్య స్థానాలకు చేరుకోవడానికి మెట్రో రైళ్లను ఆశ్రయించారు. బస్సులు లేకపోవడంతో కొందరు ట్రాఫిక్ సమస్య ఉండదని మరికొందరు మెట్రో రైళ్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తోంది హైదరాబాద్ మెట్రో రైల్.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories