కోట్లు కురిపిస్తున్న హైదరాబాద్ మెట్రో: రెండో దశపై ఎన్వీఎస్ రెడ్డి కసరత్తు

కోట్లు కురిపిస్తున్న హైదరాబాద్ మెట్రో: రెండో దశపై ఎన్వీఎస్ రెడ్డి కసరత్తు
x
Highlights

హైదరాబాద్ నగరానికే మణిహారంగా ఉన్న మెట్రో తొలి దశను పూర్తి చేసుకుని దేశంలోన రెండో దశ పనులను ప్రారంభించడానికి దృష్టి సారిస్తున్నారు అధికారులు.

హైదరాబాద్ నగరానికే మణిహారంగా ఉన్న మెట్రో తొలి దశను పూర్తి చేసుకుని దేశంలోన రెండో దశ పనులను ప్రారంభించడానికి దృష్టి సారిస్తున్నారు అధికారులు. ఇందులో భాగంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఆర్జీఐఏ) వరకు మెట్రోను పరుగులు తీపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంపై హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేసారు.

మెట్రోను విస్తరించేందుకు డీపీఆర్ కూడా సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా రాయదుర్గం నుంచి ఆర్జీఐఏ(31 కిలోమీటర్లు), లక్డీకపూల్ నుంచి ఆర్జీఐఏ, నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు కొత్త మార్గాలను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు వారు తెలిపారు.అంతే కాక హైదరాబాద్ నగరంలో ఎంతో రద్దీగా ఉండే పాతబస్తీలో కూడా 5 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశామని ఈ సందర్భంగా ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. నగరంలో మెట్రోను ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 16 కోట్ల మందికిపైగా మెట్రోలో ప్రయాణించారని తెలిపారు. దీంతో మెట్రో నుంచి రోజుకు రూ. కోటి, మెట్రో మాల్స్ నుంచి నెలకు రూ. 10 కోట్ల ఆదాయం వస్తుందని ఆయన తెలిపారు.

తిరుమల కొండపైకి..

ఇక పోతే ఆంధ్రప్రదేశ్ లో ఎంతో ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతిలోనూ మెట్రోను వేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇటీవల కాలంలో తిరుపతి వెళ్లిన సందర్భంగా ఎన్వీఎస్ రెడ్డితో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సమావేశమయ్యారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే మెట్రో గురించ చర్చించారని తెలిపారు. తిరుపతిలో మెట్రో రైలు ఏర్పాటు చేస్తే ఇక్కడికి వచ్చే భక్తులకు సౌకర్యంగా ఉంటుందని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డితొ తెలిపామని అన్నారు.

ఈ నేపథ్యంలోనే ఎన్వీఎస్ రెడ్డి తిరుపతి మెట్రో రైలుపై ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లాలోని తిరుపతి నుంచి తిరుమల మూడు రోజులు పాటు తరుపతిలో సర్వే చేసినట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం తిరుమలను రిజర్వ్ ఫారెస్ట్ కింద ప్రకటించారని, అందుకు మెట్రో ప్రాజెక్టు విషయంలో త్వరలోనే ఓ కీలక నిర్ణయం తీసుకుంటామన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories