హైదరాబాద్ లో అందుబాటులోకి మరో ఫ్లై ఓవర్!

హైదరాబాద్ లో అందుబాటులోకి మరో ఫ్లై ఓవర్!
x
Highlights

హైదరాబాద్ నగర ప్రజలకు మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది. నిత్యం ట్రాఫిక్ తో సతమత మయ్యే ఐటి కారిడార్ లో ఇది ప్రారంభమైంది. బయో డైవర్సిటి జంక్షన్ లో...

హైదరాబాద్ నగర ప్రజలకు మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది. నిత్యం ట్రాఫిక్ తో సతమత మయ్యే ఐటి కారిడార్ లో ఇది ప్రారంభమైంది. బయో డైవర్సిటి జంక్షన్ లో ఇప్పటికే ఉన్న లెవల్ 2 ఫ్లై ఓవర్ కిందనే ఈ లెవల్ వన్ ఫ్లై ఓవర్ నిర్మితమైంది. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా లాంచ్ చేయబడిన ఈ లెవల్ వన్ ‌ఫై ఓవర్ పై ఓ లుక్.

గ్రేటర్ హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య ను తగ్గించేందుకు జీహెచ్ఎంసీ ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోంది. అందుకోసం నగరంలో srdp ప్రాజెక్టు కింద ఫ్లై ఓవర్ లను నిర్మిస్తున్నారు. గురువారం సైబరాబాద్ పరిధిలోని బయో డైవర్శిటీ జంక్షన్ దగ్గర మరో ఫ్లై ఓవర్ ను ప్రారంభించారు మంత్రి కేటీఆర్. 30 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ ఫ్లై ఓవర్ తో బయోడైవర్శిటీ జంక్షన్ దగ్గర ట్రాఫిక్ సమస్య తీరనుంది. దీంతో గచ్చిబౌలి నుంచి రాయదుర్గం మీదుగా మెహిదీపట్నం వైపు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు తగ్గనున్నాయి.

మొదట నిర్మించిన సెకండ్ లెవల్ వంతెన గత ఏడాది నవంబర్ 4న అందుబాటులోకి వచ్చింది. అయితే వరుస ప్రమాదాలతో కొన్నాళ్లు వంతెనను మూసి వేశారు. స్పీడ్ లిమిట్ పెట్టి తిరిగి ప్రారంభించారు. ఇదే చౌరస్తాలో ఇప్పడు ఫస్ట్ లెవల్ ఫ్లై ఓవర్ తో గచ్చిబౌలి నుంచి మెహిదీపట్నం వైపు వెళ్లే వారు జంక్షన్ వద్ద ఆగాల్సిన అవసరం ఉండదు. SRDP ప్యాకేజీ-4లో భాగంగా ఐటీ కారిడార్ లోని పలు జంక్షన్లలో 379 కోట్లతో వంతెనలు, అండర్ పాస్ ల నిర్మాణ పనులను సర్కార్ ప్రారంభించింది. ఇప్పటికే అయ్యప్ప సోసైటీ జంక్షన్ అండర్ పాస్, మైండ్ స్పేస్ చౌరస్తాలో వంతెన, అండర్ పాస్, రాజీవ్ గాంధీ జంక్షన్ ఫ్లై ఓవర్, బయో డైవర్సిటీ సెకండ్ లెవల్ వంతెన అందుబాటులోకి వచ్చాయి. త్వరలోనే కామినేని కుడివైపు వంతెన, ఎల్బీనగర్ అండర్ పాస్ లు అందుబాటులోకి వస్తాయంటున్నారు జీహెచ్ఎంసీ అధికారులు.

మొత్తం 690 మీట‌ర్లు పొడవు, 11.50 మీట‌ర్ల వెడల్పుతో ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం జరిగింది. ఈ మూడు లైన్ల ప్లై ఓవర్ పై ఒకే వైపు వాహనాలను అనుమతిస్తారు. దీనితో కేవలం గచ్చిబౌలి నుంచి మోహదీపట్నం వైపు వెళ్లే ట్రాఫిక్‌ను ఈ వంతెన క్లియర్ చేయనుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories