ఆన్ లైన్ భోజనం.. హైదరాబాద్ ఎన్నో స్థానంలో ఉందో తెలుసా..

ఆన్ లైన్ భోజనం.. హైదరాబాద్ ఎన్నో స్థానంలో ఉందో తెలుసా..
x
Highlights

రోజు రోజుకు టెక్నాలజీ పెరిగిపోతుంది. దీనికి అనుగుణంగానే ఆన్ లైన్ షాపింగ్ లు కూడా పెరిగిపోతున్నాయి. ఒక్క క్లిక్ కొడితే చాలు ఏ వస్తువు కావాలనుకున్నా ఇంటి ముందుకు వచ్చేస్తున్నాయి.

రోజు రోజుకు టెక్నాలజీ పెరిగిపోతుంది. దీనికి అనుగుణంగానే ఆన్ లైన్ షాపింగ్ లు కూడా పెరిగిపోతున్నాయి. ఒక్క క్లిక్ కొడితే చాలు ఏ వస్తువు కావాలనుకున్నా ఇంటి ముందుకు వచ్చేస్తున్నాయి. ఇక ఇదే కోణంలో ఏం తినాలకున్నా వండుకోవాల్సిన పని లేకుండా డైనింగ్ టేబుల్ మీదికి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మెట్రో నగరాల్లోని యువత ఎక్కువగా ఈ విధంగానే తమకు కావలసిన ఫుడ్ ని క్షణాల్లోనే ఆర్డర్ పెట్టుకుంటున్నారు. పార్టీలన్నా, బర్తడేలన్నా చిన్న చిన్న అకేషన్లకు ఈ ఆర్డర్లను ఎక్కువగానే ఉపయోగించుకుంటున్నారు. దీంతో ఫుడ్‌డెలివరీ సంస్థలకు రోజురోజుకూ ఆర్డర్లు సంఖ్య వెల్లువెత్తుతున్నాయి.

వీటిలో ముఖ్యంగా స్విగ్గీ, జొమాటో, ఫుడ్‌పాండా వంటి సంస్థల్లో మాత్రమే ఫుడ్‌లవర్స్‌ఆర్డర్లను పెట్టుకుంటారు. ఆ సంస్థలు కూడా వారి కస్టమర్లకు నచ్చిన ఆహార పదార్థాలను నిమిషాల్లో అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొన్నిరెస్టా రెంట్లు, హోటళ్లు టేక్‌అవే కౌంటర్లను ఈ సంస్థల డెలివరీ బాయ్స్‌కోసం ఏర్పాటు చేస్తుండటం విశేషం.

ఇకపోతే దేశంలోని కొన్ని మెట్రో నగరాల్లో ఈ విధంగా ఆన్‌లైన్‌ఫుడ్‌ఆర్డర్లను చేసకునే జాబితాలో బెంగళూరు మొదటి స్థానంలో ఉందని ఒక సర్వేలో తెలిపారు. బెంగళూరులో దాదాపుగా రోజుకు 95 వేల ఆన్‌లైన్‌ఆర్డర్లు వస్తాయని సంస్థ పేర్కొంది. కాగా తరువాత వచ్చే మూడు స్థానాల్లో ఢిల్లీ, ముంబై ఉండగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ కూడా టాప్ 5లొ స్ధానం దక్కించుకుందని ట్రాక్సాన్‌అనే సంస్థ నిర్వహించిన అధ్యయనంలో నిర్ధారించారు. ఇకపోతే ఢిల్లీలో ఒక రోజుకు 87 వేలు ఆర్డర్లు వస్తాయని, ముంబైలో 62 వేల ఆర్డర్లు అందుతున్నాయని తెలిపారు.

ఇక ఇదే జాబితాలో నాలుగో స్థానం దక్కించుకున్న హైదరాబాద్‌లో ప్రతిరోజు 54 వేల ఆర్డర్లు ఫుడ్‌డెలివరీ సంస్థలకు అందుతున్నాయని పేర్కొంది. దేశంలో ఇప్పటివరకూ దాదాపుగా వెయ్యి ఫుడ్‌డెలివరీ సంస్థ ఏర్పాటు కాగా అందులో ఎక్కువగా హైదరాబాద్‌లో కార్యకలాపాలు సాగిస్తుండటం విశేషం.

ఈ అంకుర సంస్థల్లో వేలాది మంది యువతకు పార్ట్‌టైమ్‌తోపాటు ఫుల్‌టైమ్‌కొలువులు దక్కుతుండటంతో ఎంతో మంది యువత నిరుద్యోగ సమస్య నుంచి బయటికి వస్తున్నారనే చెప్పుకోవాలి. ఇందులో పనిచేసే యువకులకు ఆయా సంస్థలు జీలాలు ఇవ్వడమే కాకుండా కొంత మేరకు టిప్ రూపంలో కూడా ఆదాయం లభిస్తుంది. ఈ సంస్థల ఆదాయం విషయానికొస్తే

వినియోగదారులు రూ.350 విలువ గల ఆహార పదార్థాలు మొదలు ఆపై విలువ చేసే ఆర్డర్లను చేస్లే ఇంటి వద్దకే సరఫరా చేస్తున్నాయి. ఇందులో రెస్టారెంట్ల రేటింగ్, కస్టమర్లు ఆర్డర్‌చేసే ఆహారం విలువను బట్టి ఈ సంస్థలకు 10 శాతం నుంచి 20శాతం కమీషన్‌లభిస్తుందని సమాచారం. దాంతో పాటుగానే వినయోగదారుల నుంచి మరో 5% కమీషన్ లభిస్తుందంటారు. ఈ విధంగా లాభాలు రావడంతో వారి వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతూనే ఉందంటున్నాయి మార్కెట్‌వర్గాలు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories