Coronavirus Fever: భాగ్యనగరంలో భయం భయం ..'కరోనా'తో కలకలం

Coronavirus Fever: భాగ్యనగరంలో భయం భయం ..కరోనాతో కలకలం
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

రోజు రోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. తాజాగా చైనాలో ఈ కేసులకు సంబంధించిన సర్వేలో ఇప్పటికే 440 పాజిటివ్ కేసులు నమోదు కాగా, తొమ్మిది మంది ఈ వైరస్ తో మృతి చెందారు.

రోజు రోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. తాజాగా చైనాలో ఈ కేసులకు సంబంధించిన సర్వేలో ఇప్పటికే 440 పాజిటివ్ కేసులు నమోదు కాగా, తొమ్మిది మంది ఈ వైరస్ తో మృతి చెందారు. దీంతో కొద్ది రోజులుగా చైనీయులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న 'కరోనా' వైరస్‌ ఇప్పుడు నగరానికి విస్తరించే అవకాశం ఉందని నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు.

కాగా చలికాలంలో ఎక్కువగా వ్యాపించే స్వైన్ ఫ్లూ వ్యాధి లక్షణాలు, ఈ కరోనా వ్యాధి లక్షణాలు ఒకే విధంగా ఉంటాయి. స్వైన్‌ఫ్లూ వైరస్‌ ఎలాగయితే ఒకరి నుంచి మరొకరికి సోకుతుందో ఈ వ్యాధి కూడా అలాగే సోకుతుంది. స్వైన్‌ఫ్లూలో కన్పించే లక్షణాలన్నీ (దగ్గు, జలుబు, జ్వరం, తలనొప్పి, ఒంటి నొప్పులు)కరోనాలోనూ వైరస్ లోనూ కన్పిస్తాయి. వైరస్‌ సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు కానీ, దగ్గినప్పుడు కానీ ఆ వైరస్‌ గాలిలోకి చేరి దాని ద్వారా సమీపంలో ఉన్నవారికి సోకుతుంది. స్వైన్‌ఫ్లూ, కరోనా లక్షణాలు ఒకేలా ఉండటంతో దాన్ని గుర్తించడం వైద్యులకు కూడా కష్టతరంగానే మారింది. వ్యాధి నిర్ధారణ కోసం సరైన పరీక్షలు చేస్తేనే కాని ఏ వైరస్ అని తెలియదు. దీని ద్వారా మూత్రపిండాల పనితీరు దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. అంతే కాకుండా నిమోనియా తీవ్రతకు శ్వాస తీసుకోవడం కష్టమవు తుంది. ఈ వైరస్‌ బారిన పడుకుండా ముందజాగ్రత్తగా ఎలాంటి యాంట్రిరెట్రో వైరస్‌ మందులు, టీకాలు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

కాగా చైనాలో ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందడంతో భారత్‌ నుంచి చైనాకు.. చైనా నుంచి భారత్ కు రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికుల కూడా ఈ వైరస్ నోకి ఉండొచ్చని భావిస్తున్నారు. దీంతో జ్వరంతో బాధపడుతున్న బాధితుల నుంచి రక్త నమూనాలు సేకరించి ఆస్పత్రి మైక్రోబయాలజీ విభాగంలోని వైరాలజీల్యాబ్‌లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. స్వైన్‌ఫ్లూ జ్వరంతో బాధపడుతూ చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి ఎవరు వచ్చినా వారికి గురువారం నుంచి హెచ్‌1 ఎన్‌1 పరీక్షలతో పాటు కరోనరి వ్యాధి నిర్ధారణ పరీక్షలు కూడా చేయాలని నిర్ణయించారు వైద్య అధికారులు.

ఈ వార్తను ఇంగ్లీష్ లో చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి...

Show Full Article
Print Article
More On
Next Story
More Stories