గురుకుల విద్యార్థుల ప్రతిభతో ఇంధన రహిత బైక్

గురుకుల విద్యార్థుల ప్రతిభతో ఇంధన రహిత బైక్
x
Highlights

ఇంధనంతో నడిచే వాహనాల వలన రోజు రోజుకు పర్యావరణ కాలుష్యం పెరిగిపోతుంది. అంతే కాదు ఇంధనంతో నిడిచే వాహనాల సంఖ్య పెరిగిపోవడంతో రానున్న కాలంలో ఇంధనం కొరత కూడా ఏర్పడనుంది.

ఇంధనంతో నడిచే వాహనాల వలన రోజు రోజుకు పర్యావరణ కాలుష్యం పెరిగిపోతుంది. అంతే కాదు ఇంధనంతో నిడిచే వాహనాల సంఖ్య పెరిగిపోవడంతో రానున్న కాలంలో ఇంధనం కొరత కూడా ఏర్పడనుంది. నేపథ్యంలో తెలంగాణ మైనారిటీ గురుకుల విద్యార్థులు కాలుష్యాన్ని నివారించే దిశగా, ఇంధన కొరతని తొలగించే దిశగా ఆలోచించి ఇంధన రహిత ద్విచక్రవాహనాన్ని ఆవిష్కరించారు.

పూర్తివివరాల్లోకెళ్తే కొమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌ మైనారిటీ గురుకుల పాఠశాలలో సలీం, జె.ఆకాష్, అఖిల్‌ కుమార్, ఎస్‌.డి.ఆలం, మాలికార్జున్, ఎం.డి.ఇసానుల్లాఖాన్‌లు పదోతరగతి చదువుతున్నారు. వీరంతా ఒక బృందంగా ఏర్పడి పర్యావరణాన్ని కాపాడే విధంగా ఇందన రహిత బైక్‌ను తయారు చేద్దామనుకున్నారు.

ఈ సందర్భంలోనే మైనారిటీ గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి బి.షఫీవుల్లా ఇటీవల కాగజ్‌ నగర్‌లోని గురుకులాలను పర్యటించారు. దీంతో ఆ విద్యార్థులు వారికి వచ్చిన ఆలోచనను అతనికి తెలియజేసారు. విద్యార్థుల ఉత్సాహాన్ని చూసిన కార్యదర్శి విద్యార్థుల ఆలోచనకు తనవంతు ఊతం అందించి వారిని ప్రోత్సహించాడు. ఇందుకు కావలసిన అన్ని ఏర్పాట్లను కల్పించి హైదరాబాద్‌ బహదూర్‌పురా బాయ్స్‌–1లో వారికి తగిన సౌకర్యాలు కల్పించారు.

దీంతో విద్యార్థులు తతి తక్కువ సమయంలోనే గేర్‌లెస్‌ బైక్‌ను తయారుచేసారు. తరువాత శాశ్వత మాగ్నెట్‌ బ్రష్‌లెస్‌ డీసీ (బీఎల్‌డీసీ) మోటార్, పవర్‌ కంట్రోలర్, డైనమో, బ్యాటరీస్, ఎంసీబీ బాక్స్‌లు ఏర్పాటు చేసి తద్వారా శక్తిని పొందేలా ఏర్పాటు చేశారు. అచ్చం ఇంజన్‌ బైక్‌ లానే కనిపించే ఈ బైక్ పెట్రోల్, డీజిల్, చార్జింగ్‌ లాంటి ఎలాంటి ఇంధనం అవసరం లేకుండా దాదాపుగా 50–60 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది.

ఇక పోతే ఈ బైక్ తయారి సక్సెస్ కావడంతో గురుకుల కార్యదర్శి బి. షఫీవుల్లా, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్‌ దొరకడం చాలా కష్టం, కాబట్టి ఈ బైక్‌ చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఇలాంటి వినూత్న ప్రయోగాలను మరిన్ని చేసి విద్యార్థులు సక్సెస్ కావాలని సూచించారు. ఇందుకు గారు సమ్మర్‌ వెకేషన్‌లో హైదరాబాద్‌లో ఎక్స్‌పోజర్‌ వర్క్‌షాప్‌ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories