లాక్‌డౌన్ తర్వాత.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న తొలి రైలు..

లాక్‌డౌన్ తర్వాత.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న తొలి రైలు..
x
Highlights

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చాలా కాలం తర్వాత రైలు కూత పెట్టింది. దాదాపు 45 రోజుల తర్వాత సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల సందడి...

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చాలా కాలం తర్వాత రైలు కూత పెట్టింది. దాదాపు 45 రోజుల తర్వాత సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల సందడి కనిపించింది. కేంద్రం ఇటీవల పరిమిత సంఖ్యలో రైళ్లను నడిపాలని నిర్ణయించడంతో బెంగుళూరు నుంచి ఢిల్లీ వెళ్తున్న రైలు సికింద్రాబాద్ స్టేషన్‌కు వచ్చింది. 10వ నెంబర్ ప్లాట్ ఫాం నుంచి ప్రయాణికులకు సేవలను ప్రారంభించారు.

దాదాపు 243 మంది ప్రయాణికులు బెంగళూర్ నుంచి సికింద్రాబాద్‌కు వచ్చారు. బెంగళూరు రైల్వే స్టేషన్‌ నుంచి సికింద్రాబాద్‌ స్టేషన్‌కు రైలు చేరుకున్న అనంతరం 288 మంది ప్రయాణికులు రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించారు. ప్రతి ప్రయాణికుడికి థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించిన అనంతరం వారిని స్టేషన్‌ లోపలికి అనుమతించారు. భౌతిక దూరం పాటిస్తూ.. గమ్యానికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. రైలు ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరి చేతికి అధికారులు స్టాంప్ వేస్తున్నారు. నగరానికి వచ్చిన వారిని కూడా హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచిస్తున్నారు. ఏదైనా అనారోగ్య లక్షణాలు కనబడితే వెంటనే వైద్యులను సంప్రధించాలని సూచించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories