Hyderabad: ఆ వార్తలో వాస్తవం లేదు: పోలీస్ శాఖ

Hyderabad: ఆ వార్తలో వాస్తవం లేదు: పోలీస్ శాఖ
x
Highlights

పోలీసు వ్యవస్థపై అసత్య కథనాలు ప్రచురించి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని జితేందర్-అడిషనల్ డీజీ మీడియాకు సూచించారు.

పోలీసు వ్యవస్థపై అసత్య కథనాలు ప్రచురించి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని జితేందర్-అడిషనల్ డీజీ మీడియాకు సూచించారు. ఓ పత్రికలో వచ్చిన దొంగలతో దోస్తీ అనే కథనంలో వాస్తవం లేదని ఆ వార్తను ఆయన ఖండించారు. ఈ వార్తపై వారు సరైన వివరణ ఇవ్వాలి ఆయన అన్నారు. పోలీసులు ప్రజల రక్షణ కోసం 24 గంటలు పనిచేస్తున్నారని స్పష్టం చేసారు. మీడియా సమాజంలో కీలక పాత్ర పోషిస్తుందని నిజానిజాలు మాత్రమే వార్తలలో రాయాలని సూచించారు.

ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి వార్త రాయడం బాధాకరం అని, పోలీసుల పోస్టింగుల్లో రాజకీయ నాయకుల జోక్యం ఉండదని తెలిపారు. తప్పు చేసినా పోలీసులపై చర్యలు తీసుకుంటున్నామని, ఇలాంటి వార్తలు మీడియాలో రాయడం వలన పోలీసులు మనోధైర్యం కోల్పోతారన్నారు. అసత్య వార్తలు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాము ఆయన హెచ్చరించారు.

సైబరాబాద్ సిపి విసి సజ్జనార్...

దొంగలతో దోస్తీ పేరుతో ఒక ప్రధాన పత్రికలో అసత్య వార్త రావడం బాధాకరమని ఆయన అన్నారు. తెలంగాణ పోలీసులంటే ప్రజల్లో ఒక నమ్మకం ఉందని, దేశంలోనే తెలంగాణ పోలీస్ నెంబర్ వన్ అని ఆయన అన్నారు. పోలీసింగ్ వ్యవస్థ మునుపటికంటే ఇప్పుడు చాలా మెరుగు పడిందని చెప్పారు. ప్రధాన కేసులు 24 ఘంటల్లోనే చేధించిన ఘనత మన తెలంగాణ పోలీస్ సొంతం చేసుకందని గర్వంగా చెప్పారు. అలాంటి తెలంగాణ పోలీస్ లపై అసత్య ప్రచారాలు చేస్తూ వార్త రాయడం దురదృష్టకర మన్నారు.

ఇలాంటి వార్తలు రాయడం వల్ల తెలంగాణ పోలీస్ అప్రతిష్ట పలు అవుతుంది, మీకు ఎటువంటి సమాచారం ఉన్న మమ్మల్ని అడిగి రాయాలని సూచించారు. అసత్య వార్తలు రాసిన పత్రిక పై లీగల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని, దొంగలతో పోలీసులకు ఎటువంటి దోస్తీ ఉండదని ఆయన స్పష్టం చేసారు. పోలీస్ అనేది ఒక వ్యవస్థలో ఒక్కరు , ఇద్దరు చేసిన తప్పుకు మొత్తం పోలీస్ వ్యవస్థను తప్పు బట్టడం సరికాదని అన్నారు. ఇతర దేశ, రాష్ట్ర లనుండి మన తెలంగాణ పోలీస్ ను ఆదర్శంగా తీసుకొని పనిచేస్తున్నాయని స్పష్టం చేసారు.

అంజనీకుమార్ : హైదరాబాద్ సీపీ

దొంగలతో దోస్థాని కథనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు. రాష్ట్రం ఏర్పడ్డ తరువాత నక్సలిజం పెరుగుతుందని అప్పట్లో ప్రచారం జరిగిందని. అరేండ్ల కాలంలో నక్సలిజం, టెర్రరిజం కదలికలు లేవని తెలిపారు. గత ఆరు నెలలు లో సిటీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగలేదని, ప్రెస్ బాధ్యత గా వ్యవహారించి వార్తలు రాయాలని చెప్పారు. మీడియా రాసే వార్తలపై ప్రజల్లో నమ్మకం రావాలి కాని అపనమ్మకం కాదని స్పష్టం చేసారు. ప్రతీ విషయాన్ని మీడియాతో షేర్ చేస్తున్నామని, ప్రభుత్వం, ప్రజల సహకారంతో దేశంలోనే బెస్ట్ పోలిసింగ్ గా నిలిచామన్నారు.

డిపార్ట్ మెంట్ ను పరువు తీసేలా నిరాధార వార్తాలు రాయొద్దని తెలిపారు. ఇవ్వాళ ఓ పేపర్ పబ్లిష్ అయిన వార్తల్లో నిజం లేదని, లంచాలు తీసుకుని ప్రమోషన్స్ ఇస్తున్నారు అనడానికి మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయో చూపాలని సవాలు చేసారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్లు, రెకమండేషన్స్ లేకుండా వర్క్ చేస్తున్నామని స్పష్టం చేసారు. మాకు చాలా ఫ్రీడమ్ ఉందని, ట్రాన్స్ ఫర్స్, ప్రమోషన్స్ నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయని తెలిపారు. ఆధారాలు లేకుండా వార్తలు రాస్తే ప్రొఫెషనల్ రిపోర్టింగ్ అనిపించుకోదని స్పష్టం చేసారు.

రాచకొండ సీపి : మహేష్ భగవత్...

ప్రముఖ వార్తా పత్రికలో దొంగలతో దోస్తి అనే కథనంతో వచ్చిన వార్తను ఖండిస్తున్నాం రాచకొండ సీపి మహేష్ భగవత్ అన్నారు. ఈ వార్తతో తెలంగాణ పోలీసు శాఖలోని అందరి ఆత్మస్థైర్యం దెబ్బతీసేవిధంగ ఉందన్నారు. ఇలాంటి వార్తలు ప్రచురించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అన్నంలో ఒక రాయి వస్తే మొత్తాన్ని ఎలాగైతె పడేయమో ఎవరో ఒక్కరు చేసిన తప్పుకు శాఖ మొత్తంపై ఇలాంవి రాసి రాష్ర్ట ప్రజలకు నష్టం కలిగిస్తుందని తెలిపారు. ఎవరైనా వార్తలు రాసేముందు పై అధికారుల వివరణ తీసుకుంటె బాగుంటుందని సూచించారు.

తెలంగాణ రాష్ట్ర పోలీసుల సంఘం..

దొంగలతో దోస్తీ అనే శీర్షికతో ఓ పత్రిక వచ్చిన వార్త కథనం లో ఏ మాత్రం వాస్తవం లేదని, అది పూర్తిగా సత్యదూరంగా ఉందని దీనిని ఖండిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర పోలీసుల సంఘం తెలిపింది. ఈ కథనంతో పోలీస్ శాఖలో దాదాపు లక్ష మంది పోలీసు అధికారులు, సిబ్బంది ఆత్మస్థైర్యం దెబ్బతినడంతో పాటు, రాష్ట్ర ప్రజలకు నష్టం కలిగించే విధంగా ఉందంటూ వై.గోపిరెడ్డి హైదరాబాద్ లో తెలిపారు. రాష్ట్రంలో పోలీస్ శాఖ అత్యంత పారదర్శకంగా పనిచేస్తుందని, పోలీసు అధికారులు నియామకాల్లో, బదిలీలలో పూర్తి నిబంధనలను అనుసరించి, అధికారుల పనితీరు ఆధారంగా ఇతర ఇండిక్టేటర్ల ఆధారంగా చేపట్టడం జరుగుతుందని తెలిపారు. పోలీస్ అధికారుల నియామకాల్లో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల జోక్యం ఉన్నదని చేసిన ఆరోపణలు సరికాదన్నారు.

గత ప్రభుత్వాల కన్నా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రభుత్వ పోలీస్ శాఖ పటిష్ఠతకు ప్రత్యేక నిధులు చర్యలు చేపట్టడంతో శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీస్ దేశంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దరని తెలిపారు. ఈ కథనం రాష్ట్ర ప్రభుత్వ పరువు ప్రతిష్టలను పూర్తిగా దిగదార్చే విధంగా ఉందన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు 24 గంటలు పనిచేసే పోలీస్ శాఖపై వచ్చిన ఈ తప్పుడు కథనం మొత్తం పోలీస్ వ్యవస్థకే మచ్చ తెచ్చే విధంగా ఉందని ఆక్షేపించారు. ఈ కథనం పై పోలీస్ శాఖ న్యాయపరమైన చర్యలు చేపడుతుందని గోపి రెడ్డి స్పష్టంచేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories