V. Hanumantha Rao: మాజీ ఎంపీ వీహెచ్‌కు కరోనా పాజిటివ్‌

V. Hanumantha Rao: మాజీ ఎంపీ వీహెచ్‌కు కరోనా పాజిటివ్‌
x
Highlights

తెలంగాణలో కరోనా వైరస్ కలకలం రేపుతుంది. గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య కోకొల్లలుగా పెరిగిపోతున్నాయి. సామాన్య ప్రజలతో పాటు వైద్యులు, పోలీసులు, జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు ఎంతో మంది వైరస్ బారిన పడుతున్నారు.

తెలంగాణలో కరోనా వైరస్ కలకలం రేపుతుంది. గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య కోకొల్లలుగా పెరిగిపోతున్నాయి. సామాన్య ప్రజలతో పాటు వైద్యులు, పోలీసులు, జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు ఎంతో మంది వైరస్ బారిన పడుతున్నారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంత మంది ఎమ్మెల్యేలు వైరస్ బారిన పడగా ప్రస్తుతం మరో సీనియర్ నేత కరోనా కరోనా బారిన పడ్డాడు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, బాజిరెడ్డి గోవర్థన్‌, బీగాల గణేష్‌ గుప్తాలకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం వారంత చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

ఇప్పుడు ఇదే వరుసలో టీకాంగ్రెస్ సీనియర్ నేత కూడా జాయిన్ అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నేత‌, మాజీ ఎంపీ వీ హనుమంతరావు (వీహెచ్‌) కరోనా వైరస్‌ బారిన పడ్డారు. ఈయన గత రెండు రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండగా శనివారం వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించారు. కాగా ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో అప్రమత్తమయిన అధికారులు వెంటనే నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. కాగా ప్రస్తుతం అక్కడి వైద్యులు వీహెచ్‌కు చికిత్స అందిస్తున్నారు. కాగా వారి కుటుంబ సభ్యులు ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్నారు. ఈ క్రమంలోనే అధికారులు, వైద్యులు ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.

ఇక ఈ మధ్యకాలంలోనే వీహెచ్ కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన జలదీక్ష లో పాల్గొన్నారు. అంతే కాదు ఇటీవలే ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని వందమందికి దుప్పట్లను కూడా పంపిణీ చేశారు. కాగా అదే రోజు నుంచి వీహెచ్‌ జ్వరంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది. వీహెచ్ కు కరోనా అని తెలిసిన వెంటనే అధికారులు గడిచిన వారం రోజులుగా ఆయన ఏయే కార్యక్రమాల్లో పాల్గొన్నారు, ఎవరితో కలిసి మెలిగారు అనేదానిపై అధికారులు ఆరా తీసున్నారు.

ఇకపోతే నిన్నఅత్యధికంగా 546 కేసులు నమోదయ్యాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలో 458 కేసులు నమోదు చేసుకున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో పోరాడి 203 మంది మరణించారు. దినికి సంబంధించిన హెల్త్ బులిటెన్ ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 7,072 కి చేరింది. ఇప్పటి వరకు కరోనాతో పోరాడి 3506 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 3363 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 14,516 కేసులు నమోదు కాగా, 375 మంది ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో మొత్తం 3,95,048 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,68,269 ఉండగా, 2,13,830 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 12,948 మంది కరోనా వ్యాధితో మరణించారు


Show Full Article
Print Article
More On
Next Story
More Stories