ప్రయాణికులకు శుభవార్త: సిటీ బస్సుల ఛార్జీల తగ్గింపు.!

ప్రయాణికులకు శుభవార్త: సిటీ బస్సుల ఛార్జీల తగ్గింపు.!
x
TSRTC
Highlights

నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆర్టీసీ యాజమాన్యం ప్రయాణికులకు శుభవార్తను తెలియజేసింది.

నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆర్టీసీ యాజమాన్యం ప్రయాణికులకు శుభవార్తను తెలియజేసింది. ఇటీవలే ఆర్టీసీ చార్జీలను పెంచిన విషయం అందరికీ తెలిసిందే. ఇదే నేపథ్యంలో ప్రయాణికులకు విలాసవంతమైన ప్రయాణాన్ని అందించే మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల ఛార్జీలను కూడా పెంచారు.

కానీ ఇప్పుడు ప్రయాణికుల సౌకర్యార్థం ఇప్పుడు ఆ చార్జీలను ఆర్టీసీ యాజమాన్యం తగ్గించనుంది. చార్జీల తగ్గింపు విషయంలో అధికారులు ఇప్పటికే కసరత్తు పూర్తి చేసారు. ఇక ఇన్‌చార్జీ ఎండీ సునీల్‌శర్మకు దీనికి ఆమోదం తెలిపితే వెంటనే తగ్గిన చార్జీలు అమలు కానున్నాయి. జనవరి 1 నుంచి సిటీ ప్రయాణికులకు కొత్త ఛార్జీలు వర్తించవచ్చని తెలుస్తోంది.

ప్రస్తుతం మెట్రో లగ్జరీ ఏసీ బస్సులు నగరంలో 80 తిరుగుతున్నాయి. ఈ బస్సుల ప్రత్యేకతను చూసుకుంటే ఆటోమేటిక్ డోర్లు, సౌకర్యవంతమైన సీట్లు, సీసీ కెమెరాలు కలిగి ఉంటుంది. ఈ బస్సులు ఎక్కువగా ఉప్పల్‌-వేవ్‌రాక్, లింగంపల్లి-ఎల్‌బీ నగర్, లింగంపల్లి-దిల్‌సుఖ్‌నగర్, సికింద్రాబాద్‌-విమానాశ్రయం, సికింద్రాబాద్‌-ఎల్‌బీనగర్‌ వంటి ముఖ్యమైన మార్గాల్లో నడుస్తున్నాయి. మొదట్లో తక్కువగా ఉన్న ఈ బస్సుల సంఖ్య టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎక్కువగా పెరిగాయి.

ఇప్పటి వరకూ రూట్ల వారిగా మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల చార్జీలను చూసుకుంటే దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి లింగంపల్లికి రూ.80 ఉంటే, అదే ఎల్‌బీ నగర్‌ నుంచి ఏకంగా రూ.110 ఉంది. దీంతో చాలా మంది ప్రయాణికులు మెట్రో బస్సులను, రైళ్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో మెట్రో లగ్జరీ బస్సుల్లో ప్రయాణికలు సంఖ్య తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని రూ.110గా ఉన్న చార్జీని రూ.75కి తగ్గించింది. రూ.80గా ఉన్న ఛార్జీని రూ.50కి కుదించింది. ఇక మినిమమ్ టికెట్‌ ధరను రూ.20గా అలాగే కొనసాగిస్తుంది. ఇక ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయంతో మెట్రో డీలక్స్ బస్సుల కంటే మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల చార్జీలు రూ.ఐదో, రూ.పదో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories