49 రోజులు.. 501 దేవాలయాలు..

49 రోజులు.. 501 దేవాలయాలు..
x
Highlights

ప్రపంచంలో సాంకేతికత పెరిగిపోతుంది. దీంతో సంస్కృతి సాంప్రదాయాల యువత పాటించడమే మర్చిపోతున్నారు. ప్రధానంగా వారి భవిష్యత్తును మంచి మార్గంలో నడిపించాల్సిన...

ప్రపంచంలో సాంకేతికత పెరిగిపోతుంది. దీంతో సంస్కృతి సాంప్రదాయాల యువత పాటించడమే మర్చిపోతున్నారు. ప్రధానంగా వారి భవిష్యత్తును మంచి మార్గంలో నడిపించాల్సిన యువత స్మార్ట్‌ఫోన్ల మోజులో పడి తమ వ్యక్తిగత జీవితాల్ని నాశనం చేసుకుంటున్న సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఈ మార్పులు కొంతవరకు మేలు చేస్తున్నప్పటికీ ఎక్కువ శాతం చెడు మార్గాన్నే చూపిస్తున్నాయి. ఈ విధంగా సమాజంలో వస్తున్న మార్పులు కొద్ది కొద్దిగా ప్రతి ఒక్కరి జీవితాల్ని ప్రభావితం చేస్తున్నాయి.

ఇలాంటి చెడుప్రభావాలు తమ పైన పడకూడదని ఇద్దరు వ్యక్తులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. అసలు ఆ నిర్ణయం ఏంటి వారిద్దరూ ఏం చేసారో ఇప్పుడు తెలసుకుందాం. పూర్తివిరాల్లోకెళితే బంజారాహిల్స్‌ రోడ్‌నెంబర్‌–10లో నూర్‌నగర్‌లో నివసించే తమిళనాడుకు చెందిన ఇద్దరు అన్నదమ్ములు పండిదురై(32), కార్తికేయన్‌(28)లు ఇటీవల అత్యద్భుతమైన ఆధ్యాత్మిక యాత్ర చేపట్టారు. ఈ నేపథ్యంలో గత ఏడాది నవంబరులో వీరిద్దరూ ఆధ్యాత్మికయాత్రను ప్రారంభించారు. అందులో భాగంగా వారు 49 రోజుల్లో 501 దేవాలయాలను సందర్శించారు.

ఇందుకుగాను వారు దాదాపుగా 20,800 కిలోమీటర్ల పాటు ప్రయాణం సాగించారు. ఈ ప్రయాణాన్ని కూడా వారు వారి స్వంత గ్రామంలో మొదలు పెట్టి బంజారాహిల్స్‌ చేరుకోవడంతో ముగించారు. ఈ సందర్బంగా ఆ ఇద్దరు అన్నదమ్ములు మాట్లాడుతూ తాము చేసిన ఆధ్యాత్మిక యాత్రకు అడుగడుగునా అపురూపమైన ఆదరణ లభించిందన్నారు.ఈ యాత్ర వారి జీవితంలో ఎన్నటికీ మరిచిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోతుందన్నారు.

దేవాలయాల వ్యవస్థను ఆధ్యాత్మిక సంపదను, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకునేందుకు పెద్దలు చేస్తున్న ప్రయత్నాలకు యువత తోడ్పాటు ఎంతో అవసరం ఉందన్నారు. ఈ యాత్ర కోసం వారు ప్రత్యేకంగా ఓ కారును కూడా తయారు చేసుకున్నారు. ఆ కారుపై వివిధ ఆలయాల నమూనాలు కూడా వేసుకున్నారు. ఇక ఈ యాత్ర ముగిసిన అనంతరం తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజ్‌ను కూడా కలుసుకున్నామని, ఆమె తమ యాత్రను అభినందించారని చెప్పారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories