వ్యాధికారక బ్యాక్టిరియాను గుర్తించడం ఇక సులువు

వ్యాధికారక బ్యాక్టిరియాను గుర్తించడం ఇక సులువు
x
రైట్ బయోటిక్ యంత్రం
Highlights

హైదరాబాద్ లోని బిట్స్ పిలాని యూనివర్సిటీ విద్యార్థులు ప్రొఫెసర్ సుమన్ కపూర్ నేతృత్వంలో రైట్ బయోటిక్ అనే వినూత్న యంత్రాన్ని కనిపెట్టారు.

హైదరాబాద్ లోని బిట్స్ పిలాని యూనివర్సిటీ విద్యార్థులు ప్రొఫెసర్ సుమన్ కపూర్ నేతృత్వంలో రైట్ బయోటిక్ అనే వినూత్న యంత్రాన్ని కనిపెట్టారు. ఈ యంత్రం ద్వారా రక్త, మూత్ర సంబంధిత వ్యాధికారక బ్యాక్టీరియాను సులువుగా గుర్తించవచ్చు. ఈ పరికరాన్ని వర్సిటీలోని ఇంక్యుబేషన్ కేంద్రంలో పనిచేస్తున్న ఎక్స్ బిట్స్ అంకుర సాయంతో తయారు చేసారు.

ఈ యంత్రంతో కేవలం మానవ శరీరంలో ఉన్న రక్త, మూత్ర నమూనాల్లో వ్యాధికారక బాక్టీరియాను కనుక్కోవడమే కాకుండా గతంలో మూసీ నది కాలుష్యంపైన కూడా సర్వే నిర్వహించింది. ఈ సర్వే సక్సెస్ కావడంతో నదుల్లోని ప్రమాదకర బ్యాక్టీరియాను గుర్తించవచ్చని ఇటీవల సీపీపీబీ అధికారులు జాతీయ హరిత ట్రైబ్యునల్ కు నివేదిక సమర్పించారు. దీంతో ఆ యంత్రాన్ని వినియోగించి దేశంలోని కాలుష్య కారక నదుల్లో ఉన్న ప్రమాదకర బ్యాక్టీరియాను గుర్తించాని సీపీపీబీని ఎన్జీటీ ఆదేశించింది.

ఇదిలా ఉంటే ఇప్పటివరకూ ల్యాబొరెటరీలో రక్త, మూత్ర నమూనాలు సేకరించి రోగి శరీరంలో ఉన్న వ్యాధికారక బ్యాక్టీరియాను కనుక్కోవడానికి మూడు రోజుల కాలవ్యవధి పట్టేది. కానీ ఇప్పుడు సాంపిల్స్ ఇచ్చిన నాలుగు గంటల్లోనే నమూనాలకు సంబంధించిన ఫలితం రావడంతో రోగికి సత్వరమే చికిత్స ఇచ్చే అవకాశం కల్పించింది బిట్స్ పిలాని వర్సిటీ.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories