కస్టడీ దిశలో మరిన్ని నిజాలు కక్కిస్తారా..?

కస్టడీ దిశలో మరిన్ని నిజాలు కక్కిస్తారా..?
x
Highlights

దిశ కేసు నిందితులను విచారించడానికి పోలీసులకు ఏడు రోజుల కస్టడీకి అనుమతిస్తూ షాద్‌నగర్ కోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో ఇప్పటికే చర్లపల్లి జైల్లో...

దిశ కేసు నిందితులను విచారించడానికి పోలీసులకు ఏడు రోజుల కస్టడీకి అనుమతిస్తూ షాద్‌నగర్ కోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో ఇప్పటికే చర్లపల్లి జైల్లో రిమాండ్‌‌లో ఉన్న నిందితులను సైబరాబాద్ పోలీసులు ఇవాళ ఉదయం తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. ఈ కేసు విషయంలో ఇంకా అంతు చిక్కని ఎన్నో సందేహాలపై విచారణలో ఆరా తీయనున్నారు.

దిశా కేసు నిందితులను పోలీసు కస్టడీకి అనుమతిస్తూ షాద్‌నగర్ కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ కేసులో నలుగురు నిందితులను వారం రోజుల పాటు విచారించడానికి కోర్టు పోలీసులకు అనుమతి ఇచ్చింది. షాద్‌నగర్‌లో సంచలనం సృష్టించిన ఈ హత్యాచార ఘటనలో నిందితులు ప్రస్తుతం చర్లపల్లి జైలు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వీరిని సైబరాబాద్ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. ఈ కేసులో ఇప్పటికే 3 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి సమగ్ర వివరాలు సేకరించే పనిలో ఉన్నాయి.

దిశ కేసు సమగ్ర దర్యాప్తులో భాగంగా కేసుకు సంబంధించి కీలక వివరాలు తెలుసుకోవడానికి, ఆధారాలు సేకరించడానికి పోలీసులు వీరిని కస్టడీకి తీసుకొని విచారించనున్నారు. బాధితురాలి సెల్ ఫోన్ ఇప్పటికీ మిస్సింగ్‌లో ఉంది. దాన్ని ఏం చేశారు? ఎక్కడ పడేశారు? ఘటన తర్వాత లారీని మళ్లీ తొండుపల్లి గేటు వద్దే ఎందుకు పార్క్ చేశారు? తదితర అంశాల మిస్టరీ చేధించనున్నారు.

అలాగే, బాధితురాలిని హత్య చేసిన తర్వాత పెట్రోలు పోసి దహనం చేశారా? లేదా సజీవదహనం చేశారా? అనే విషయంలోనూ అనుమానులున్నాయి. పోలీసుల విచారణలో ఈ అంశాల గుట్టు విప్పనున్నారు. దీంతో సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. తద్వారా శంషాబాద్ టోల్ గేట్ దగ్గర నుంచి చటాన్‌పల్లి వరకు జరిగిన సంఘటనకు సంబంధించిన వివరాలను పూర్తిగా తెలుసుకోనున్నారు. తద్వారా ఘటనకు సంబంధించి మరిన్ని కీలక వివరాలు తెలిసే అవకాశం ఉంది.

మరోవైపు దిశ కేసు విచారణ కోసం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. మహబూబ్‌నగర్ అదనపు సెషన్స్, జిల్లా న్యాయస్థానాన్ని ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టుగా ఏర్పాటు చేశారు. దీంతో ఈ కేసులో సత్వర విచారణ చేపట్టి నిందితులకు సాధ్యమైనంత త్వరగా శిక్ష విధించే అవకాశం ఉంది. అయితే నిందితులపై ప్రజాగ్రహం పెల్లుబుకుతున్న తరుణంలో దీన్ని ఎంత వరకు చేయగలుగుతారనేది ప్రశ్నార్థకంగా మారింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories