బోయిన్‌పల్లిలో భారీ అగ్ని ప్రమాదం.. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి మల్లారెడ్డి

బోయిన్‌పల్లిలో భారీ అగ్ని ప్రమాదం.. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి మల్లారెడ్డి
x
Highlights

భారీ అగ్నిప్రమాదం సంభవించి వలస కూలీలు వేసుకున్న గుడిసెలు పూర్తిగా దగ్ధమైన సంఘటన హైదరాబాద్ నగరంలోని బోయిన్ పల్లి బాపూజీ నగర్‌లో చోటు చేసుకుంది.

భారీ అగ్నిప్రమాదం సంభవించి వలస కూలీలు వేసుకున్న గుడిసెలు పూర్తిగా దగ్ధమైన సంఘటన హైదరాబాద్ నగరంలోని బోయిన్ పల్లి బాపూజీ నగర్‌లో చోటు చేసుకుంది. పూర్తివివరాల్లోకెళితే ఎక్కడి నుంచో వచ్చిన వలస కూలీలు నగరంలోని బోయిన్ పల్లి బాపూజీ నగర్‌ అపార్ట్ మెంట్ల మధ్యలో గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. శుక్రవారం మధ్యానం సమయంలో ఓ గుడిసెలో ఒక్క సారిగా సిలిండరు పేలడంతో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ గుడిసెకు ఒక్కసారిగా అంటుకున్న మంటలు చుట్టుపక్కల ఉన్న మిగతా గుడిసెలకూ వ్యాపించాయి. గుడిసెలన్నీ దగ్గర దగ్గరగా ఉండడంతో మంటలు త్వరగా వ్యాపించి మరో గుడిసెలోని సిలిండర్ కూడా పేలింది. దీంతో వలస కూలీలు వేసుకున్న గుడిసెలు, ఆటో పూర్తిగా దగ్ధమయ్యాయి.

అసలే ఎండలు, దానితో పాటుగా తీవ్రమైన వడగాడ్పులు వీస్తుండడంతో మంటలు మరింత చెలరేగాయి. దీంతో స్థానికులు, అపార్డ్ మెంట్ వాసులు భయపడి అక్కడి నుంచి మంటలకుదూరంగా పరుగులు తీసారు. తీవ్ర భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి ఫోన్ చేశారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను ఆర్పడానికి ప్రయత్నం చేశారు. ఇక ఈ ప్రమాదం సంభవించినపుడు ఈ రెండు గుడిసెల్లో సిలిండర్లు పేలిన సమయంలో అదృష్టవశాత్తు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పి ప్రాణ నష్టం కూడా తప్పింది.

ఇక ఈ విషయం తెలుసుకున్న మంత్రి మల్లారెడ్డి ప్రమాదస్థలిని పరిశీలించి ప్రమాదం జరిగిన తీరుని అక్కడి స్థానికలును అడిగి తెలుసుకున్నారు. ఆయన సతీమని కల్పన మంత్రి మల్లారెడ్డి తరుఫున బాదిత కుటుంబాలకు తక్షణ సహాయంగా రూ. లక్ష ఆర్థిక సహాయం చేసారు. వారితో పాటు మల్కాజిగిరి తెరాస పార్లమెంట్ ఇంఛార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి, బోర్డు సభ్యులు మహేశ్వర్ రెడ్డి, క్రిశాంక్ తదితరులు ఉన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories