Top
logo

హుజూర్‌నగర్‌లో ముగిసిన ఉపఎన్నిక పోలింగ్

హుజూర్‌నగర్‌లో ముగిసిన ఉపఎన్నిక పోలింగ్
Highlights

హుజూర్‌నగర్ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హ‍క్కును వినియోగించుకున్నారు....

హుజూర్‌నగర్ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హ‍క్కును వినియోగించుకున్నారు. మొత్తం 2లక్షల 37వేల మంది ఓటర్లలో 80శాతానికి పైగా ఓటేశారు. అయితే, తుది లెక్కల తర్వాత పోలింగ్ పర్సంటేజ్‌ 85శాతం దాటి 90వరకు నమోదు కావొచ్చని అంచనా వేస్తున్నారు. ఇంతకుముందు ఇక్కడ 88శాతం పోలింగ్ నమోదు కావడంతో ఈసారి అది బ్రేకవడం ఖాయమనే మాట వినిపిస్తోంది.

మొత్తం 302 పోలింగ్ కేంద్రాల్లో హుజూర్‌నగర్ ఉపఎన్నిక పోలింగ్ జరిగింది. పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా ప్రతీ కేంద్రాన్ని వెబ్‌క్యాస్టింగ్‌తో పర్యవేక్షించారు. అలాగే, పెద్దఎత్తున బలగాలను మోహరించి చిన్న అవాంఛనీయ ఘటన కూడా జరగకుండా పకడ్బందీగా ఉపఎన్నిక పోలింగ్‌ను నిర్వహించారు.

Next Story