Top
logo

ఊపందుకున్న హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల ప్రచారం

ఊపందుకున్న హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల ప్రచారం
Highlights

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. పలు పార్టీలు ప్రచార జోరు పెంచాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ...

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. పలు పార్టీలు ప్రచార జోరు పెంచాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ముమ్మరం ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థుల తరపున అధినేతలు రంగంలోకి దిగుతున్నారు. తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు.

ఉప ఎన్నికలో ఆ సీటును కైవసం చేసుకునేందుకు పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ మండలంలోని పలు గ్రామాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చింతలపాలెం, మేళ్ల చెరువు మండలాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి తరపున మంత్రి సత్యవతి రాథోడ్ ప్రచారం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓటు వేయాలని సైదిరెడ్డి కోరారు. హుజుర్‌నగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి, ఎమ్మెల్యే సీతక్క, వీహెచ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్‌ గెలిస్తే 104 గొర్రెలతో పాటు ఇంకో గొర్రె చేరుతుందని సీతక్క ఎద్దేవా చేశారు. అబద్దపు మాటలతో గద్దెనెక్కిన కేసీఆర్ అహంకారంతో వ్యవరిస్తున్నారని వీహెచ్ అన్నారు. తాము చేసిన అభివృద్ధి టీఆర్ఎస్‌కు కనబడటం లేదని ఉత్తమ్ పద్మావతి అన్నారు.

హుజూర్‌నగర్ బీజేపీ అభ్యర్థి కోట రామారావు తరపున బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ గరిడేపల్లి మండలంలో రోడ్‌ షో నిర్వహించారు. నిజామాబాద్ ఫలితమే హుజూర్‌నగర్‌లో రిపీట్ అవుతుందని లక్ష్మణ్ అన్నారు. ప్రజలు స్పష్టంగా మార్పు కోరుకుంటున్నారని అన్నారు.విమర్శలు ప్రతి విమర్శలతో అభ‌్యర్థులు ప్రచారాన్ని వేడెక్కించారు. తమ వల్లే అభివృద్ధి జరుగుతుందని ఓటర్లకు హామీల వర్షం కురిపిస్తున్నారు.

Next Story