కృష్ణమ్మ పరవళ్లు..

కృష్ణమ్మ పరవళ్లు..
x
Highlights

కృష్ణానదికి ఎగవ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు భారీగా నీరు చేరుతుంది.

కృష్ణానదికి ఎగవ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు భారీగా నీరు చేరుతుంది. ఈనేద్యంలోనే నాగర్జున సాగర్ నుంచి 26 గేట్లు ఎత్తివేసి వరద నీరు దిగువకు వదిలారు. ఈ వరద తాకిడితో పులిచింతల ప్రాజెక్టు‌పై ప్రభావం చూపుతుంది. గంట గంటకు వరద ఉధృతి పెరుగుతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమై పులిచింత ప్రాజేక్టు ముప్పు గ్రామాలో తిష్ట వేశారు. కృష్ణానదికి ఎగవ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో గుంటూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.

పులిచింతల ముంపు గ్రామాలతోపాటు కృష్ణా పరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలపై కూడా జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. పులిచింతల ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 45 టీఎంసీలు అయినప్పటికీ 10 టీఎంసీల నీరు దాటితే ముంపు గ్రామాలలోకి వరద నీరు వస్తుంది.ఇక 20 టిఎంసీలు దాటితే ముంపు గ్రామాలు మొత్తం నీట మునిగే అవకాశముంది. దీంతో పులిచింతల ప్రాజెక్టు నుంచి నీటిని ఎప్పటికప్పుడు కృష్ణానదిలోకి వదిలేందుకు అధికారులు సిద్దమయ్యారు. పులిచింతల ప్రాజెక్టు నుంచి వదిలిన నీరు ప్రకాశం బ్యారేజీ మీదుగా దిగువ కృష్ణకు వెళ్లి పెనుమూడి వారధి వద్ద సముద్రంలో కలుస్తుంది. ఈ మధ్య లోని లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరే అవకాశం ఉండటంతో జిల్లా యంత్రాంగం స్థానిక అధికారులను అప్రమత్తం చేసింది. ఓవైపు ముంపు ప్రాంతాలైన బెల్లంకొండ మండలం , మాచవరం మండలం లోని రెవిన్యూ, పోలీస్ సిబ్బంది సంయుక్తంగా గ్రామాల్లోకి వెళ్లి స్థానికంగా ఉన్న ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు.

కృష్ణా జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ రేపల్లె కృష్ణా తీర ప్రాంతానికి వెళ్లి లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి అధికారులకు ముందు జాగ్రత్త చర్యలు సూచించారు. ఈరోజు రాత్రికి పులిచింతల ప్రాజెక్టు 6 నుంచి 10 టీఎంసీలు నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గంట గంటకు వరద పెరిగే అవకాశం ఉండడంతో ముంపు గ్రామాలలో ఎవరిని ఉండనివ్వకుండా అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. దీంతో అధికారులు అప్రమత్తమై ముప్పు గ్రామాలో హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

ప్రస్తుతం పెద్ద ఎత్తున వరద ఉధృతి వస్తుండటంతో ఈసారి పరిస్థితి గతంలో కంటే మరింత అధికంగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎంత వరద వచ్చినా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశించారు . అదేవిధంగా ప్రజలు కూడా వరద ఉదృతి పట్ల జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తున్న ప్రజలు కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories