తెలుగురాష్ట్రాల్లో ఆలయాలకు పోటెత్తిన భక్తులు

తెలుగురాష్ట్రాల్లో ఆలయాలకు పోటెత్తిన భక్తులు
x
తెలుగురాష్ట్రాల్లో ఆలయాలకు పోటెత్తిన భక్తులు
Highlights

నూతన సంవత్సర వేళ తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. నూతన సంవత్సరం తొలిరోజు ఆలయాల సందర్శన చేసి అర్చనలు, పూజలు నిర్వహిస్తున్నారు. ఈ కొత్త...

నూతన సంవత్సర వేళ తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. నూతన సంవత్సరం తొలిరోజు ఆలయాల సందర్శన చేసి అర్చనలు, పూజలు నిర్వహిస్తున్నారు. ఈ కొత్త సంవత్సరంలో అన్ని సవ్యంగా జరిగిపోవాలని అనుకున్న లక్ష్యాలు నెరవేరాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు చేశారు.

కొత్త సంవత్సరం కావడంతో యాదాద్రి పుణ్యక్షేత్రానికి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. కుటుంబ సమేతంగా పిల్లాపాపలతో కలిసి యాదాద్రికి తరలివచ్చి లక్ష్మీనరసింహస్వామివార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. భారీ సంఖ్యలో భక్తులు రావడంతో స్వామివారి ధర్మ దర్శనానికి 4 గంటల సమయం, స్పెషల్‌ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.

భాగ్యనగరంలో ఆధ్యాత్మికశోభనెలకొంది. న్యూఇయర్‌ సందర్భంగా నగరవాసులు ఆలయాలబాటపడ్డారు. దీంతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మతల్లి టెంపుల్‌కి భక్తులు పోటెత్తారు.

నూతన సంవత్సరం పురస్కరించుకొని విజయవాడ ఇంద్రకీలాద్రి భక్తులతో పోటెత్తింది. భక్తులు దుర్గమ్మను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. కొత్త సంవత్సరం తమకు అంతా మంచే జరగాలని వేడుకున్నట్లు తెలిపారు.

నూతన సంవత్సర వేడుకలను విశాఖ ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. విశాఖవాసుల ఆరాధ్యదైవమైన సంపత్ వినాయకున్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

కర్నూలు జిల్లాలో కొత్త సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. కొత్త సంవత్సరం మొదటి రోజున ఆలయాలకు భక్తులు క్యూ కట్టారు. కర్నూలు జిల్లాలోని దేవాలయాలన్నీ కోలాహలంగా మారాయి. తమ ఇష్ట దైవాన్ని తలుచుకుని ఈ సంవత్సరం అంతా ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూడాలని కోరుకున్నామంటున్నారు భక్తులు.

న్యూ ఇయర్ సందర్భంగా శ్రీవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తిరుమల శ్రీవారిని టీ-కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క, వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ్, సినీ గాయకులు శ్రావణ భార్గవి, హేమచందర్ దర్శించుకున్నారు. తెలుగు ప్రజలకు వారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories