వరుణుడి కరుణ కోసం హిజ్రాల పూజలు

వరుణుడి కరుణ కోసం హిజ్రాల పూజలు
x
Highlights

దేశానికి అన్నం పెట్టే రైతన్న వర్షలు లేక పంట మొలక ఎత్తక ఆశగా ఆకాశం వైపు చూస్తున్నాడు. వర్షాలు పడక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న రైతుల...

దేశానికి అన్నం పెట్టే రైతన్న వర్షలు లేక పంట మొలక ఎత్తక ఆశగా ఆకాశం వైపు చూస్తున్నాడు. వర్షాలు పడక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న రైతుల సంక్షేమం కోసం హిజ్రాలు పూజలు చేశారు. కొత్తగూడెం పట్టణంలోని బూడిదగడ్డ ఏరియాలోని తమ ఆరాద్య దైవం ముర్గీమాత ఆలయంలో వరుణ దేవుడు కరుణించాలంటూ ప్రత్యేక పూజలు చేసి రాత్రంతా జాగారం చేశారు. మంగళ వాయిద్యాలతో ముర్గీమాత ఆలయానికి ప్రదర్శనగావెళ్లారు. ఇద్దరు హిజ్రాలను మాతంగులగా చేసి ఆకుపచ్చని వస్త్రాలను ధరింప చేసి ముర్గీమాతకు అంకితం ఇచ్చారు.

ఈ పూజకు సంబంధించిన పూర్తి ఖర్చు హిజ్రాలే భరించారు. ఇలా రైతన్న కోసం హిజ్రాలు ముందుకు వచ్చి రైతన్నకు బాసటగా పూజలు నిర్వహించడం చాలా సంతోషం అని అక్కడి గ్రామస్థలు అంటున్నారు. రైతు సంతోషంగా ఉంటేనే ప్రజలు సంతోషంగా ఉంటారని లేదంటే ఆహారం దొరకదన్నారు. అందుకే కుల మతాలకతీతంగా వారి వారి దేవుళ్ళను ప్రార్థిస్తూ పూజలు చేయాలని కోరారు. అమ్మవారికోసం బిందెలలో పాలు తీసుకొని రాత్రివేళలో తాము పూజలు నిర్వహిస్తారని తెలిపారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories