ఏసీ రూముల్లో కూర్చొని తమాషా చేస్తున్నారా : అధికారులపై హై కోర్ట్ ఆగ్రహం

ఏసీ రూముల్లో కూర్చొని తమాషా చేస్తున్నారా : అధికారులపై  హై కోర్ట్   ఆగ్రహం
x
Highlights

రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్న డెంగీ మరణాలపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.

రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్న డెంగీ మరణాలపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో డెంగీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. డెంగీ వ్యాప్తిపై డాక్టర్. కరుణ దాఖలు చేసిన అప్పిల్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. వేళల్లో ప్రజలు డెంగి బారిన పడుతున్నారని. వారిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని. ప్రబుత్వం డెంగీ నిర్మూలనకు చర్యలు తీసుకోవడం లేదని పిటిషనర్ తరుపు న్యాయవాది తెలిపారు. ప్రభుత్వం తరఫున కోర్టు ముందు చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రెటరీ హాజరయ్యారు.

ఏసీ రూముల్లో కూర్చొని తమాషా చేస్తున్నారా అని న్యాయమూర్తులు వీరిపై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,800 డెంగీ కేసులు నమోదైతే ప్రభుత్వం వాటిలో సగం కేసులు మాత్రమే చూపెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేసారు. దీంతో స్పందించిన సీఎస్ ఎస్కే జోషి డెంగీ నివారణకు చర్యలు తీసుకున్నామని కోర్టుకు చెప్పగా, నివారణ చర్యలు తీసుకుంటే డెంగీ కేసులు ఎందుకు పెరుగుతున్నాయని కోర్టు వారిని ప్రశ్నించింది. డెంగీ మరణాలపై తమ వద్ద ఆధారాలు ఉన్నాయని కోర్టు తెలిపింది. మరో సారి మూసీనదిని పరిశీలించాలని అధికారులను ఆదేశించింది. డెంగీ వ్యాధిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైతే మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని సూచించింది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories