అప్పటిదాకా సచివాలయం, ఎర్రమంజిల్‌ కూల్చొద్దు: హైకోర్టు

అప్పటిదాకా సచివాలయం, ఎర్రమంజిల్‌ కూల్చొద్దు: హైకోర్టు
x
Highlights

తెలంగాణ సచివాలయం., ఎర్రమంజిల్ భవనాలు కూల్చివేసి కొత్త భవనాలు నిర్మాంచాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి హైకోర్ట్ బ్రేక్ వేసింది. తదుపరి ఉత్తర్వులు...

తెలంగాణ సచివాలయం., ఎర్రమంజిల్ భవనాలు కూల్చివేసి కొత్త భవనాలు నిర్మాంచాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి హైకోర్ట్ బ్రేక్ వేసింది. తదుపరి ఉత్తర్వులు వెల్లడించేంత వరకు భవనాలు కూల్చవద్దని ఆదేశాలు జారి చేసింది.

సచివాలయం, ఎర్రమంజిల్‌ భవనాల కూల్చివేత-నూతన భవన నిర్మాణం విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. భవనాల కూల్చివేత సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలపైన పిటీషన్ పై విచారణ జరిపింది హైకోర్టు తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు నిలిపివేయాలంటూ ఆదేశించింది. కౌంటర్ కు 15 రోజులు గడువు కావాలని ప్రభుత్వం తరపు న్యాయవాది కోరారు.

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లోని ప్రభుత్వ కట్టడాలపై గవర్నర్ నిర్ణయాధికారం ఉంటుందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. సెక్షన్ 8 (2)(3) ప్రకారం భవనాలు శాంతి భద్రతలపై ఉమ్మడి రాజధానిలో గవర్నర్‌కే అధికారం ఉంటుందని పిటిషనర్ అన్నారు. చారిత్రక, వారసత్వ, సాంస్కృతిక కట్టడాలు 100 ఏళ్ళ దాటితే వాటిని కూల్చడానికి వీల్లేదని పిటిషనర్ కోర్టుకు తెలిపారు.

పిటిషనర్ వాదనలు విన్న హైకోర్టు 100 ఏళ్ళు దాటిన కట్టడాలను జాతీయ సంపదగా గుర్తించిందా? అని పిటిషనర్‌ను ప్రశ్నించింది న్యాయస్థానం. ప్రస్తుతం పూర్తి వివరాలు లేవని తర్వాత సమర్పిస్తామన్నారు పిటిషనర్. ప్రజాధనం దుర్వినియోగం చేసేందుకే ప్రభుత్వం నూతన భవనాలను నిర్మిస్తున్నారని పిటిషనర్ వాదనలు వినిపించారు. తదుపరి విచారణ బుధవారంకు వాయిదా వేసిన హైకోర్టు కేసు తేలేంత వరకు భవనాలు కూల్చవద్దంటూ స్పష్టం చేసింది. దసరా వరకు కొత్త సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాలు సాధ్యమవుతుందా లేదా అన్నది హైకోర్టు నిర్ణయంపైనే ఆధారపడి ఉంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories