పోర్న్‌ వెబ్‌సైట్లపై హైకోర్టు సీరియస్

పోర్న్‌ వెబ్‌సైట్లపై హైకోర్టు సీరియస్
x
Highlights

పోర్న్ వెబ్ సైట్లపై మరోసారి హైకోర్టు సీరియస్ అయింది. అసలు అలాంటి వైబ్ సైట్లపై గూగుల్ చర్చలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. పోర్న్ వెబ్ సైట్లపై పూర్తి వివరాలు అందజేయాల్సిందిగా గూగుల్ సంస్థకు ఆదేశాలు జారీచేసింది.

పోర్న్ వెబ్ సైట్లపై మరోసారి హైకోర్టు సీరియస్ అయింది. అసలు అలాంటి వైబ్ సైట్లపై గూగుల్ చర్చలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. పోర్న్ వెబ్ సైట్లపై పూర్తి వివరాలు అందజేయాల్సిందిగా గూగుల్ సంస్థకు ఆదేశాలు జారీచేసింది. పోర్న్‌ వెబ్‌సైట్లపై చర్యలు తీసుకోవాలని దాఖలైన పిటిషన్‌పై నేడు రాష్ట్ర హైకోర్టు విచారణ చేపట్టింది. ఫేస్ బుక్ లో ఉన్న పేర్లు, ఫోటోలను తీసుకొని పోర్న్ వెబ్ సైట్లో పెడుతున్నారని ఓ యువతి ఏకంగా హైకోర్టుని ఆశ్రయించింది.

అయితే తన పేరు, ఫోటోలను పోర్న్ వైబ్ సైట్ల నుండి తీసివేయాలని గతంతోనే గూగుల్ కి ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. అయితే తన ఫిర్యాదును గూగుల్ సంస్థ పట్టించకోకోపోవడంతో తాను హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారించిన హైకోర్టు.. పోర్న్ సైట్స్‌ వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సీరియస్ అయింది. ఇక తదుపరి విచారణను సెప్టెంబర్ 1కి వాయిదా వేసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories