Top
logo

షైన్‌ ఆసుపత్రి ఘటన... హై కోర్ట్ సీరియస్

షైన్‌ ఆసుపత్రి ఘటన... హై కోర్ట్ సీరియస్
X
Highlights

ఇటీవల షైన్‌ ఆసుపత్రిలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం సంఘటన మరువలేనిది. ఇలాంటి ప్రమాదం జరగడంలో నిర్లక్ష్యం...

ఇటీవల షైన్‌ ఆసుపత్రిలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం సంఘటన మరువలేనిది. ఇలాంటి ప్రమాదం జరగడంలో నిర్లక్ష్యం వహించిన ఎండీ సునీల్‌ కుమార్‌రెడ్డి, ఇతర సిబ్బందిని ఎల్బీ నగర్‌ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసారు. అనంతరం వీరిని న్యాయ విచారణ కోసం హైకోర్టులో హాజరు పరిచిన పోలీసులపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఫైర్‌ యాక్సిడెంట్‌ అయి ఆ ప్రమాదంలో ఒక చిన్నారి ప్రాణం కోల్పోయిందని, అలాంటి నిందితులపై 304ఎ బెయిలబుల్‌ కేసు ఎలా నమోదు చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు 304 ఏ సెక‌్షన్‌ను కాస్త 304 పార్ట్‌ 2 గా మార్చి ప్రమాదానికి కారణమైన నిందితులను రిమాండ్‌కు తరలించారు.Next Story