గుర్తింపు లేని కాలేజీలపై చర్యలు తీసుకొండి : హై కోర్టు

గుర్తింపు లేని కాలేజీలపై చర్యలు తీసుకొండి : హై కోర్టు
x
తెలంగాణ హైకోర్ట్ (ఫైల్ ఫోటో)
Highlights

ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా విద్య బిజినెస్ గా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే విద్యాసంస్థలు కోకొల్లలుగా వెలుస్తున్నాయి.

ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా విద్య బిజినెస్ గా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే విద్యాసంస్థలు కోకొల్లలుగా వెలుస్తున్నాయి. సరైన ప్రమాణాలు లేకుండా, కనీస వసతులు లేకుండా కొన్ని కళాశాలలు వెలిస్తే, ఒక ప్రాంతంలో కలేజీని పెడతామని మరో ప్రాంతంలో నడిపే కళాశాలలు కొన్ని ఉన్నాయి. ఈనేపథ్యంలోనే సామాజిక కార్యకర్త రాజేష్‌ ప్రజా ఓ నిర్ణయం తీసుకున్నాడు. గుర్తింపు లేని నారాయణ, శ్రీ చైతన్య కళాశాలలపై విచారణ చేపట్టాలని ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు.

ఈ నేపథ్యంలోనే సామాజిక కార్యకర్త రాజేష్‌ ప్రజా దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో గుర్తింపు లేని కళాశాలలపై ఇంటర్‌ బోర్డు హైకోర్టుకు నివేదికను సమర్పించింది. ఈ నివేదికను పరిశీలించిన హైకోర్టు ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి ఎన్‌ఓసీ పొందని కాలేజీలకు షోకాజ్‌ నోటీసులిచ్చినట్లు తెలిపింది. కాగా ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు మార్చి 4నుంచి జరగనున్న నేపథ్యంలో కాలేజీలు మూసివేస్తే విద్యార్థులపై ప్రభావం పడుతుందని ఇంటర్‌ బోర్డు హైకోర్టుకు స్పష్టం చేసింది.

అయితే ప్రస్తుతం కోర్టు శోకాజు నోటీసులు జారీ చేసిన కళాశాలల్లో 29,808 మంది విద్యార్థులున్నారని తెలిపారు. అంతే కాకుండా ఎన్‌ఓసీ లేని కాలేజీల్లోనూ పరీక్షా కేంద్రాలు ఉన్నాయని ఇంటర్ బోర్డు తెలిపింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కోర్టు పరీక్షలు ముగిసిన తరువాత షోకాజ్‌ నోటీస్‌లు జారీ చేసిన కాలేజీలను మూసివేసేందుకు అనుమతి ఇవ్వాలని ఇంటర్‌ బోర్డు హైకోర్టును కోరింది. ఇక పోతే ఇంటర్‌ బోర్డు వాదనలు విన్న హైకోర్టు ఎన్‌ఓసీ లేని కాలేజీలపై చర్యలు తీసుకొని ఏప్రిల్‌ 3న తుది నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories