ఆర్టీసీ సమ్మెపై తుది తీర్పులో హైకోర్టు కీలక అంశాల ప్రస్తావన

ఆర్టీసీ సమ్మెపై తుది తీర్పులో హైకోర్టు కీలక అంశాల ప్రస్తావన
x
Highlights

ఆర్టీసీ సమ్మెపై సోమవారం ఇచ్చిన తుది తీర్పులో కీలక అంశాలను ప్రస్తావించింది హైకోర్టు. వాదనల్లో రాని అంశాలను ఆర్టీసీ ఆర్డర్‌ కాపీలో పొందిపరిచింది....

ఆర్టీసీ సమ్మెపై సోమవారం ఇచ్చిన తుది తీర్పులో కీలక అంశాలను ప్రస్తావించింది హైకోర్టు. వాదనల్లో రాని అంశాలను ఆర్టీసీ ఆర్డర్‌ కాపీలో పొందిపరిచింది. కార్మికులను విధుల్లోకి తీసుకునే విచక్షణను ప్రభుత్వానికి, ఆర్టీసీకే వదిలిపెడుతున్నామని హైకోర్టు తెలిపింది. ఆర్టీసీ, ప్రభుత్వం ఆదర్శ ఉద్యోగ సంస్థగా వ్యవహరిస్తాయని ఆశిస్తున్నామని, సమ్మె ఉద్దేశం డిమాండ్ల పరిష్కారానికే కానీ, విధులను విడిచిపెట్టడం కాదని గతంలో సుప్రీంకోర్టు పేర్కొందని హైకోర్టు వింవరించింది. సమ్మె చేసినంత మాత్రాన కార్మికులు విధులను వదిలిపెట్టినట్లుగా ప్రభుత్వం, ఆర్టీసీ నిర్ణయానికి రావద్దని సూచించింది.

పోరాటం కేవలం కార్మికులకు, యాజమాన్యానికి మధ్య మాత్రమే కాదని, ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం ఆ విషయాన్ని గ్రహించాలన్నారు. కార్మికులను బయటికి పంపితే వారి కుటుంబాలు ఆర్థికంగా చనిపోతాయన్న విషయాన్ని ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం గుర్తుంచుకోవాలంది. కేవలం 48 వేల మంది కార్మికులను మళ్లీ విధుల్లోకి తీసుకోవడం అనేది ప్రశ్న కాదని, 48 వేల కుటుంబాలకు చెందిన లక్షల మందికి సంబంధించిన అంశంగా ప్రభుత్వం, ఆర్టీసీ నిర్ణయం తీసుకోవాలని సూచనలు చేసింది.

వివాదం పరిష్కారమయ్యే వరకూ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉంటారన్న హైకోర్టు ప్రజల అవసరాలకు అనుగుణంగా తగినన్ని బస్సులు సమకూర్చాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories