Top
logo

తెలంగాణ స్పీకర్ కు నోటీసులు

తెలంగాణ స్పీకర్ కు నోటీసులు
Highlights

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ పోచారంకు హైకోర్టు నోటిసులు జారీ చేసింది. సీఎల్పీ విలీనంపై దాఖలైన పిటీషన్‌ను...

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ పోచారంకు హైకోర్టు నోటిసులు జారీ చేసింది. సీఎల్పీ విలీనంపై దాఖలైన పిటీషన్‌ను విచారించిన ధర్మాసనం స్పీకర్‌తో పాటు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు, అసెంబ్లీ కార్యాదర్శి, ఈసీకి నోటీసులు జారీ చేసింది. విచారణను 4 వారాల పాటు వాయిదా వేసింది. అలాగే మరో కేసులో శాసనమండలిలో సీఎల్పీ విలీనం పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో కూడా మండలి ఛైర్మెన్‌, కార్యదర్శి, ఈసీకి నోటీసులు జారీ చేసింది. అలాగే టీఆర్ఎస్‌లో విలీనం అయిన ఎమ్మెల్సీలు ప్రభాకర్‌రావు, దామోదర్‌రెడ్డి, సంతోష్‌కుమార్‌, ఆకుల లలితకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

Next Story