డెంగీ నివారణ నివేదికపై అసంతృప్తి : హై కోర్టు

డెంగీ నివారణ నివేదికపై అసంతృప్తి : హై కోర్టు
x
Highlights

డెంగీ దోమల నివారణకు కొత్త యంత్రాలను కొనుగోలు చేయాలని, మూసీ నదిని శుభ్ర పరచాలని రెండు వారాల క్రితం ఆదేశాలు జారీ చేసింది.

రాష్ట్ర్రంలో రోజు రోజుకూ పెరిగిపోతున్న డెంగీ మరణాలపై ఇటీవల హైకోర్టు ప్రభుత్వానికి కొన్ని ఆదేశాలను ఇచ్చింది. డెంగీ దోమల నివారణకు కొత్త యంత్రాలను కొనుగోలు చేయాలని, మూసీ నదిని శుభ్ర పరచాలని రెండు వారాల క్రితం ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ ప్రభుత్వం యంత్రాలను కొనుగోలు చేయకపోవడంతో ప్రభుత్వ యంత్రాంగంను హై కోర్టు తప్పుపట్టింది. ఇంకో కొన్ని రోజుల్లో జ్వరాల సీజన్ ముగిసిపోతుందని, ఇంకెప్పుడు పరికరాలను కొనుగోలు చేస్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. డెంగీ నివారణ చర్యల గురించి ప్రభుత్వం కోర్టుకు నివేదిక సమర్శించినప్పటికీ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పూర్తి వివరాలతో నివేదికను సమర్పించాలని ఆదేశిస్తూ ఈ నెల 15కి విచారణను వాయిదా వేసింది.

ప్రస్తుతం ప్రభుత్వం కోర్టుకు సమర్పించన నివేదికలో ఉన్న అంశాలను పరిశీలిస్తే గ్రేటర్‌ హైదరాబాద్‌లో పోర్టబుల్‌ ఫాగింగ్‌ యంత్రాలు 155 ఉండగా మరో 150 యంత్రాలను అదనంగా కొన్నామని తెలిపారు. పవర్‌ స్త్రేయర్లు 50 ఉండగా 950 కొనుగోలు చేస్తున్నామని, మౌంటెడ్‌ ఫాగింగ్‌ యంత్హాలు 10 ఉండగా మరో 50, న్యావ్‌శాక్‌ స్ప్రేయర్లు 667 ఉండగా మరో 133 కొనుగోలు చేస్తున్నామన్నారు. పట్టణంలో, గ్రామాల్లో శుభ్రతను పెంచడానికి అన్ని రకాల చర్యలను తీసుకుంటున్నామని తెలిపారు. కాలనీలలో పడేసే వ్యర్థాలను నియంత్రించడంలో, ప్రజలకు అవగాహణ కల్పిస్తున్నామని తెలిపారు. కాలనీలలో ఏ విధంగా శుభ్రతను పాటించాలో దోమలు పెరగకుండా ఏ విధమైన నివారణ చర్యలు తీసుకోవాలో అన్న విషయాలపైన చర్యలు తీసుకుంటున్నామని నివేదికలో నివేదించారు. డెంగ్యూ నివారణపై రాష్ట్రస్థాయిలో ఏర్పాటైన కమిటీ గత నెలలో కేంద్ర బృందంతో చర్చలు జరిపిందని తెలిపారు. అయినప్పటికీ హైకోర్టు ఈ నివేదికపై అసంతృప్తి వ్యక్తం చేసింది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories