తెలంగాణలో జోరు వానలు.. నిండుకుండను తలపిస్తున్న ప్రాజెక్టులు

తెలంగాణలో జోరు వానలు.. నిండుకుండను తలపిస్తున్న ప్రాజెక్టులు
x
Highlights

విస్తారంగా వర్షాలు కురుస్తున్న వర్షాలకు తెలంగాణలో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇసుక తిన్నెలు..రాళ్లతో కనిపించిన వివిధ...

విస్తారంగా వర్షాలు కురుస్తున్న వర్షాలకు తెలంగాణలో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇసుక తిన్నెలు..రాళ్లతో కనిపించిన వివిధ ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలతో కృష్ణమ్మ ఉరకలు వేస్తోంది. ఆల్మట్టి నుంచి మన రాష్ట్రంలోని జూరాలకు భారీ ఎత్తున వరద నీరు వస్తుంది.. రైతులు సంతోషంగా ఖరీఫ్ సాగు చేపట్టారు. వ్యవసాయ పనుల్లో తలమునకలయ్యారు.

రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో జలాశయాలకు వరద ప్రవాహం కొనసాగుతోంది. గోదావరి, కృష్ణా బేసిన్‌ లలోని ప్రాజెక్టులన్నీ నిండు కుండను తలపిస్తున్నాయి. పలు ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంటుండడంతో అధికారులు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణా బేసిన్ లోని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదను.. కిందకు అదేస్థాయిలో విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి లక్షా 43 వేల ఇన్ ఫ్లో వస్తుండగా.. గేట్లు ఎత్తి లక్షా 54 వేల 981 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 318.500 మీటర్లు దాటింది. 9.657టీఎంసీలకు ప్రస్తుతం 9.624 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

నిజామాబాద్ జిల్లా ఎస్సారెస్పి ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. ప్రాజెక్టులోకి 2 లక్షల 55 వేల క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులకు గాను.. ప్రస్తుతం 1081.10 అడుగులకు చేరింది. 90 టీఎంసీలకు గాను ప్రస్తుతం 53.819 టీఎంసీల నీరు చేరింది. ఎస్సారెస్పీకి వరదనీరు పోటెత్తుతుండడంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ కు వరద ఉధృతి కొనసాగుతోంది. 53 వేల 346 క్యూసెక్కులకు పైగా వరదనీరు జలాశయంలోకి వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 18 గేట్లు ఎత్తి 32 వేల 952 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 18.786 టీఎంసీల నీటినిల్వ ఉన్నది.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులకు వరద ఉధృతి మరింత పెరుగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో పాటు జిల్లాలో వరుసగా కురుస్తోన్న భారీ వర్షాలకు జలాశయాలకు వరద పోటెత్తుతోంది. కడం, ప్రాజెక్టులోకి భారిగా వరదనీరు వచ్చి చేరుతుండడంతో 5 వరద గేట్లను 10 అడుగుల ఎత్తుకు ఎత్తి గోదావరిలోకి నీటిని విడుదల చేశారు, కొమురం భీం ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతోంది. వట్టివాగు ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. అనుకుంట,బంగారుగూడ వాగులు ఉప్పేనలా ప్రవాహిస్తున్నాయి..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ ప్రాజెక్టుల్లోకి వరద ప్రవాహం భారీగా నమోదవుతోంది. భద్రాచలం దగ్గర గోదావరి పరవళ్లు తొక్కుతోంది. కిన్నెరసాని ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. వైరా, పాలేరు ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో 20 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. దుమ్మగూడెం మండలం పర్ణసాలలో సీతావాగు పొంగిపొర్లుతోంది. శ్రీశైలం నుంచి వస్తున్న వరదనీటితో పాటు రాష్ట్రంలో కురుస్తున్న వానలకు నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 206 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇన్ ఫ్లో లక్షా 51 వేల క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 9వేల 456 క్యూసెక్కులు ఉంది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. పాలెం వాగు ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories