వదలని వాన.. దారిలేని జన.. బతుకు భారమైపోయింది!

వదలని వాన.. దారిలేని జన.. బతుకు భారమైపోయింది!
x
Highlights

హైదరాబాద్ వంటి మహానగరాలు ఒక వైపు ముందంజలో ఉంటే మరో వైపు కొన్ని గ్రామాలు మాత్రం కనీసం కరెంటు, రోడు రవాణా సౌకర్యాలు లేకుండా చీకటిలో మగ్గిపోతున్నాయి.

హైదరాబాద్ వంటి మహానగరాలు ఒక వైపు ముందంజలో ఉంటే మరో వైపు కొన్ని గ్రామాలు మాత్రం కనీసం కరెంటు, రోడు రవాణా సౌకర్యాలు లేకుండా చీకటిలో మగ్గిపోతున్నాయి. అలాంటి గ్రామాల్లో ఒక తేలికపాటి వర్షం వస్తే చాలు కనీసం వారికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు కూడా లేకుండా పోతాయి.

అలాంటి సమయాల్లో అనారోగ్యంతో ఉన్నా, పురిటినొ ప్పులు వచ్చినా, జ్వరం ముంచుకొచ్చినా కిలోమీటర్ల పొడవునా ఎడ్లబండ్లను ఆశ్రయించాల్సిందే. వారిని ఆస్పత్రకి తీసుకెళదామన్నా కనీసం 108 కూడా ఆ గ్రామంలో రాలేని పరిస్థితి. ప్రాణంపోయినా అడ్డుగా వచ్చే వాగులు దాటేందుకు భుజాలపై మోయాల్సిందే అలాంటి విశాదకరమైన సంఘటన తెలంగాణ రాష్ర్టంలో చాలా చోట్ల చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ రాష్ర్టవ్యాప్తంగా ఇటువంటి పరిస్థితులు చాలా జిల్లాల్లో నెలకొని ఉన్నాయి. ఉదాహరణకు కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని 15 మండలాల్లో అత్యధికంగా కొండ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలే ఉన్నాయి.ఇక్కడ వర్షాకాలం వస్తే ప్రజల బతుకులు బేజారైపోతాయి.

వర్షాకాలం వస్తే బెజ్జూర్‌, దహేగాం, పెంచికల్‌పేట, కౌటాల, చింతలమానేపల్లి, తిర్యాణి, కాగజ్‌నగర్‌, కెరమెరి మండలాల్లో అనేక అటవీ గ్రామాలు బాహ్యప్రపంచానికి దూరమవుతున్నాయి. ఈ ఏడాది వర్షాకాలం పూర్తవుతున్నా కూడా ఇంతవరకూ వర్షాలు తగ్గకుండా కురుస్తున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు గ్రామాల చుట్టూ ఉన్న వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తూనే ఉన్నాయి. 8 మండలాల్లోనైతే పరిస్థితి మరీ తీవ్రంగా ఉంటుంది. బెజ్జూర్‌లో ఇప్పటికీ 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఉదాహరణకు పెంచికల్‌ పేటమండలం జిల్లె గ్రామానికి చెందిన కనక కల్పనకు సెప్టెంబర్ 15 పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో 108 కి ఫోన్ చేసినా ఊరి రోడ్డు సరిగాలేక అంబులెన్స్‌ రాలేని పరిస్థతి. దీంతో ఏం చేయాలో తోచక ఆ మహిళని ట్రాక్టర్‌లో బెజ్జూర్‌ పీహెచ్‌సీకి తరలిస్తుండగా మధ్యలోనే చనిపోయిన శిశువుకు జన్మనిచ్చింది.

ఈ మండలాలు మాత్రమే కాదు తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే ఎన్నో మండలాల్లో ఇదే పరిస్థితి. ఇప్పటి కైనా ప్రభుత్వం వెనుకబడిన మండలాలను గుర్తించి ఆ మండలాల ప్రజల బాధలను పట్టించుకోవాలని ఆయా గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories