అన్నదాత పై ప్రకృతి ప్రతాపం

అన్నదాత పై ప్రకృతి ప్రతాపం
x
Highlights

ఆరుగాలం కష్టించిన పంట చేతికొచ్చిందని ఆనందించిన రైతుల సంతోషం కొన్ని రోజుల్లోనే దూరమయిపోయింది. పంటను అమ్ముకుని అప్పులు తీర్చుకుందాం అనుకునే సమయానికి అన్నదాతపై ప్రకృతి కన్నెర్ర చేసింది.

ఆరుగాలం కష్టించిన పంట చేతికొచ్చిందని ఆనందించిన రైతుల సంతోషం కొన్ని రోజుల్లోనే దూరమయిపోయింది. పంటను అమ్ముకుని అప్పులు తీర్చుకుందాం అనుకునే సమయానికి అన్నదాతపై ప్రకృతి కన్నెర్ర చేసింది. తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం రాత్రి అక్కడక్కడా కురిసి కుండపోత వర్షాలకు రైతులు పండించిన పంటలు తడిసి ముద్దయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురవగా, మరికొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. కొంత మంది రైతులు వర్ష ఛాయలు కనిపించడంతో ముందస్తు చర్యల్లో భాగంగా పంటలపై టార్పాలిన్‌ పట్టాలు కప్పారు. అయినప్పటికీ పంటలను పూర్తి స్తాయిలో తడవకుండా కాపాడుకోలేక పోవడంతో రైతులు చింతిస్తున్నారు.

ఖమ్మం, భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో కురిసిన వర్షానికి భారీ స్థాయిలో మిర్చిపంట దెబ్బతినింది. చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో కురిసిన వర్షానికి దాదాపుగా 15 వేల ఎకరాల్లోని మిర్చిపంట దెబ్బతిన్నది. దాంతో పాటుగానే పినపాక మండలంలో సుమారు 200 క్వింటాళ్ల మిర్చి వర్షానికి తడిసి ముద్దయింది. వాటితో పాటుగానే పాల్వంచ, జూలూరుపాడు మండలాల్లో కురిసిన అకాల వర్షానికి కల్లాల్లో ఎంబెట్టి ఉన్నమిర్చి పూర్తి స్ధాయిలో తడిసింది. జిల్లాలో దాదాపుగా 3 వేల ఎకరాల్లో మిర్చి పంట సాగుచేస్తుండగా చెట్లమీద ఉన్నపంట మొదటి దశలోనే తడిసిపోయింది. మరికొంత మిర్చి పంటను కోసి కల్లాల్లో ఆరబెట్టగా అవి కూడా వర్షం దాటికి తడిసి ముద్దయ్యాయి. దీంతో రైతులకు దాదాపుగా రూ.2 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేస్తున్నారు.

కుండపోతగా వచ్చిన అకాల వర్షానికి పంటలను నష్టపోయిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షం ద్వారా రబీలో సాగుచేసిన వరిపంటకు సైతం తీవ్ర నష్టం వాటిల్లింది. దాంతో పాటుగానే ప్రస్తుతం పండిస్తున్న వరి సుంకు, పొట్టదశలో ఉండగా, భారీగా కురిసిన వర్షం వల్ల సుంకు రాలి దిగుబడి తగ్గే ప్రమాదం ఉండటంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా వర్షం ద్వారా తడినిసి మిర్చి పంటకు ప్రభుత్వమే గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలని రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు డిమాండ్‌ చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories