శ్రీశైలం డ్యాంకు భారీగా వరద నీరు

శ్రీశైలం డ్యాంకు భారీగా వరద నీరు
x
Highlights

శ్రీశైలం డ్యాంకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జూరాల నుంచి 2 లక్షలకు పైగా క్యూసెక్కుల నీరు విడుదల కాగా.. శ్రీశైలం డ్యాంకు అంతే మొత్తంలో వచ్చి...

శ్రీశైలం డ్యాంకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జూరాల నుంచి 2 లక్షలకు పైగా క్యూసెక్కుల నీరు విడుదల కాగా.. శ్రీశైలం డ్యాంకు అంతే మొత్తంలో వచ్చి చేరుతోంది. మరోవైపు కల్వకుర్తి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు కోసం.. 2 వేల 4 వందల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 831.2 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 215.807 టీఎంసీలు కాగా.. ప్రస్తుత 50.7712 టీఎంసీలుగా ఉంది. ఈ వరద మరింతకాలం కొనసాగే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories