Top
logo

డెంగ్యు మరణాలు తగ్గిపోయాయి: ఈటెల

డెంగ్యు మరణాలు తగ్గిపోయాయి: ఈటెల
Highlights

రాష్ర్టంలో డెంగ్యు మరణాలు తగ్గిపోయాయన్నారు రాష్ర్ట వైద్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్.. జ్వరం వచ్చిన వెంటనే డెంగ్యూ అని భయపడ వద్దన్నారు. ప్రజలు విషజ్వరాల భారీన పడకుండా అధికారులు తగు జాగ్రతలు పాటించాలని సూచించారు.

రాష్ర్టంలో డెంగ్యు మరణాలు తగ్గిపోయాయన్నారు రాష్ర్ట వైద్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్.. జ్వరం వచ్చిన వెంటనే డెంగ్యూ అని భయపడ వద్దన్నారు. ప్రజలు విషజ్వరాల భారీన పడకుండా అధికారులు తగు జాగ్రతలు పాటించాలని సూచించారు. పరిశుభ్రత విషయంలో ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు. జ్వరం రాగానే డెంగ్యూ అని భయపడవద్దని.. సీజనల్ వ్యాదులే అధికంగా ఉన్నాయన్నారు రాష్ర్ట వైద్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. హైదరాబాద్ సిటీలో ప్రభలుతున్న వ్యాదులపై జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. విష జ్వరాలు వ్యాపించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి ఈటెల.

విష జ్వరాల నివారణ చర్యల్లో ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. పట్టణ ఆరోగ్య కేంద్రాల్లోనూ సాయంత్రం వరకు ఓపీ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. దోమలు, అంటు వ్యాధుల నివారణకు కేవలం ప్రభుత్వ యంత్రాంగంతోనే సాధ్యం కాదని.. స్థానిక ప్రజలు, కాలనీ సంక్షేమ సంఘాలు, బస్తీ కమిటీల భాగస్వామ్యంతో విజయవంతం అవుతుందన్నారు జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్. పరిసరాలు-పరిశుభ్రతపై ఎప్పటికప్పుడు అవగాహనతో ఉండాలన్నారు. ఈసమావేశంలో మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డితో పాటు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


లైవ్ టీవి


Share it
Top