మిమ్మల్ని చూసి మొత్తం తెలంగాణా గర్విస్తోంది

మిమ్మల్ని చూసి మొత్తం తెలంగాణా గర్విస్తోంది
x
Highlights

మిమ్మల్ని చూసి మొత్తం తెలంగాణా గర్విస్తోంది అంటూ ప్రాణాలకు తెగించి ఇద్దరిని సురక్షితంగా కాపాడాడిన సీఐ సృజన్‌రెడ్డిని మాజీ మంత్రి, ఎమ్మెల్యే...

మిమ్మల్ని చూసి మొత్తం తెలంగాణా గర్విస్తోంది అంటూ ప్రాణాలకు తెగించి ఇద్దరిని సురక్షితంగా కాపాడాడిన సీఐ సృజన్‌రెడ్డిని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అభినందనలతో ముంచెత్తారు.

కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లికి చెందిన ఓ వ్యక్తి ఇంటి సమీపంలో ఉన్న చేదబావిలో మట్టి పూడిక తీత పనులకు వెళ్లారు. ఈ క్రమం లో వారు బావిలో చిక్కుకుపోయారు. అగ్నిమాపక దళం, 104 సిబ్బంది, గ్రామస్థులూ అందరూ అక్కడికి చేరుకున్నా.. ఎవరూ వారిని బావి లోంచి తీసుకు వచ్చే సాహసం చేయలేకపోయారు. ఈ పరిస్థితిలో అగ్నిమాపక సిబ్బంది తీసుకొచ్చిన నిచ్చెన సహాయంతో సీఐ సృజన్‌రెడ్డి చేదబావిలోకి దిగి, అందులో ఉన్న ఇద్దరి నడుముకు తాడు కట్టి గ్రామస్తుల సహకారంతో పైకి తీసి ఇద్దరి ప్రాణాలను కాపాడారు. తన ప్రాణాలను లెక్క చేయకుండా ఇద్దరి ప్రాణాలను కాపాడిన సీఐ సృజన్‌రెడ్డికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. సీఐ సృజన్ రెడ్డి చూపించిన తెగువకు నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

కాగా, ఇదే విషయం పై హరీష్ రావు ట్విటర్ వేదికగా స్పందిస్తూ సాహసం చేసిన సీఐని అభినందించారు. హరీష్ రావు చేసిన ట్వీట్ ఇదిగో.. మీ కోసం..

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

ప్రజలకోసం ప్రాణాలకు తెగించడం అంటే ఇదే. ఇటువంటి ధైర్యసాహసాలు మొత్తం పోలీసు శాఖకే గౌరవం తీసుకువస్తాయి. జమ్మికుంట సిఐ సృజన్ రెడ్డిగారు .. మిమ్ముల్ని చూసి పోలీసు శాఖే కాదు, మొత్తం తెలంగాణ సమాజం గర్విస్తోంది. మీ సాహసం మరెందరికో స్ఫూర్తిగానిలవాలి. మీకు నా శాల్యూట్ pic.twitter.com/TcB7hNoTzT

— Harish Rao Thanneeru (@trsharish) May 29, 2019

------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

Show Full Article
Print Article
Next Story
More Stories