కాళేశ్వరం ప్రారంభోత్సవం : జయశంకర్ ని గుర్తుచేసిన హరీష్ రావు ..

కాళేశ్వరం ప్రారంభోత్సవం : జయశంకర్ ని గుర్తుచేసిన హరీష్ రావు ..
x
Highlights

తెలంగాణా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం ఈ రోజు ఘనంగా జరిగింది .. దీనికి మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్...

తెలంగాణా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం ఈ రోజు ఘనంగా జరిగింది .. దీనికి మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ముఖ్య అతిధులుగా విచ్చేసారు.. కాళేశ్వరం ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్రంలో సంబరాలు నెలకొన్నాయి ..ఇందులో భాగంగా సిద్ధిపేట ఎమెల్యే మరియు మాజీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు సిద్దిపేటలో కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ..



ఈ సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ ఈ రోజు తెలంగాణా ముద్దుబిడ్డ ప్రొఫెసర్ జయశంకర్ వర్దంతి కావడం మరియు కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం ఒకే రోజు కావడం నిజంగా కాకతాళీయం అని పేర్కొన్నారు .. ఈ సందర్భంగా అయన జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు .. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు .

కేసీఆర్ వచ్చాక పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ లు అన్ని రన్నింగ్ ప్రాజెక్ట్ లాగా మారాయని కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్ట్ లో తన పాత్ర కూడా ఉండడం నిజంగా జన్మధన్యం అని అయన అన్నారు ..కాళేశ్వరం ప్రాజెక్టులో 19 రిజర్వాయర్లు ఉన్నాయని వీటి కెపాసిటీ 140 టీఎంసీలని 100 మీటర్ల నుంచి 620 మీటర్ల ఎత్తుకు నీళ్లను ఎత్తిపోసే ప్రాజెక్టు ప్రపంచంలో మరేదీ లేదని పేర్కొన్నారు. నిజంగా ఇది ప్రజల విజయమని తెలంగాణా ఉద్యమ విజయమని అన్నారు హరీష్ రావు ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories