అందరికీ అందుబాటులో ఆప్తమాలజీ సెంటర్‌: మంత్రి హరీశ్‌ రావు

అందరికీ అందుబాటులో ఆప్తమాలజీ సెంటర్‌: మంత్రి హరీశ్‌ రావు
x
Highlights

తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగం అభివృద్ది కోసం ఎంతగానో కృషి చేస్తుంది. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం అందించాలనే దిశగా అడుగులు వేస్తుంది.

తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగం అభివృద్ది కోసం ఎంతగానో కృషి చేస్తుంది. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం అందించాలనే దిశగా అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలోనే బస్తీదవఖానలను ఏర్పాటుచేసింది. అంతే కాకుండా జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులను కూడా ఎంతగానో అభివృద్ధి చేసారు. దాంతో పాటు 24గంటల పాటు వైద్యులు అందుబాటులో ఉండేటట్టు ఏర్పాట్లుచేసారు. గర్భిణుల కోసం ప్రత్యేకంగా పథకాలను అమలు చేసింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యాధునికి వైద్య పరికరాలను కూడా విదేశాల నుంచి తెప్పించి వైద్యం అందిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ఆప్తమాలజీ ఆపరేషన్‌ సెంటర్‌ను అదే విధంగా ఆప్తమాలజీ ఆపరేషన్‌ థియేటర్‌ను మంత్రి హరీశ్‌రావు ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిని 40 పడకల డయాలసిస్‌ కేంద్రంగా చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. అంతే కాకుండా ప్రస్తుతం 10 పడకల ఐసీయూ యూనిట్‌ను కలిగిన సిద్దిపేట ఆస్పత్రిని త్వరలోనే 20 పడకల ఐసీయూకు పెంచనున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీంతో ఎంతో మందికి మంచి వైద్యం అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఇదే విధంగా సింగిల్‌ పర్సనల్‌ ప్లేట్లెల్స్‌ సపరేటర్‌ను సిద్దిపేటలో ప్రారంభించినట్లు వెల్లడించారు.

దాంతో పాటుగానే సిద్దిపేట, గజ్వేల్‌లో కంటి ఆపరేషన్‌ థియేటర్‌ అందుబాటులోకి తెచ్చామన్నారు. కంటి సమస్యలున్న ఉన్న ప్రతి ఒక్కరూ అవకాశాన్ని వినియోగించుకుని కంటి సమస్యలను దూరం చేసుకోవాలని కోరారు. కంటి సమస్యలకు ఆపరేషన్ పేషెంట్లకు వైద్యులు అందుబాటులో ఉండాలని తెలిపారు. అనంతరం ఆస్పత్రిలోని డయాలసిస్‌ సెంటర్‌, బ్లడ్‌బ్యాంక్‌ను పరిశీలించారు. కంటి చూపు బాగుంటేనే ఏ పనినైనా చేయవచ్చని ఆయన తెలిపారు. కంటి చూపు సమస్య తక్కువగా ఉన్నప్పుడే వాటిని దూరం చేసుకోవాలని కోరారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories