మంత్రి హరీష్ రావుకు తిరుమలలో అవమానం

మంత్రి హరీష్ రావుకు తిరుమలలో అవమానం
x
Highlights

నేడు వైకుంఠ ఏకాదశి కావడంతో తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని ఆలయాలు భక్తులతో కీటాకీటాడుతున్నాయి. సామాన్య భక్తులతో పాటు రాజకీయ నాయకులూ సైతం దైవ...

నేడు వైకుంఠ ఏకాదశి కావడంతో తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని ఆలయాలు భక్తులతో కీటాకీటాడుతున్నాయి. సామాన్య భక్తులతో పాటు రాజకీయ నాయకులూ సైతం దైవ దర్శనం కోసం క్యూలో నిలుచున్నారు. ఈ నేపధ్యంలోతెరాస నేత, ఆర్ధిక మంత్రి హరీష్ రావు కి అవమానం జరిగింది.

వైకుంఠ ఏకాదశి కావడంతో తిరుమలను సందర్శించుకోవడానికి వెళ్లిన మంత్రి హరీష్ రావు కి మంత్రి హోదాలో టీటీడీ ప్రోటోకాల్ పాటించలేదు. దీనితో అసంతృప్తి వ్యక్తం చేసిన అయన టీటీడీ వైఖరి పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా దర్శనానికి వెళ్లేందుకు కూడా నిరాకరించారు.

ఆ తర్వాత ఈ విషయం తెలుసుకున్న టీటీడీ పాలకమండలి సభ్యుడు దామోదర్ అక్కిడికి చేరుకొని రద్దీ, వీఐపీల తాకిడి ఎక్కువగా ఉన్న కారణంగా, మంత్రి రాకపై సరైన సమాచారం లేనందువల్లే ఈ తప్పిదం జరిగిందని వివరణ ఇచ్చారు. ఆ తర్వాత మంత్రి హరీష్ రావు కి దగ్గరుండి స్వామి వారి దర్శనం చేయించారు.

ఇక మంత్రి హరీష్ రావుతో పాటు మంత్రి కేటీఆర్, సినీ ప్రముఖులు సుమలత, సునీల్, సప్తగిరి ఏపీ నాయకులు మల్లాది విష్ణు, లక్ష్మీ పార్వతి, రాజేంద్ర ప్రసాద్ స్వామి వారి దర్శనం చేసుకున్నారు.

ఈ వార్తను ఆంగ్లములో చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

Show Full Article
Print Article
More On
Next Story
More Stories