వచ్చే దసరా నాటికి సిద్దిపేట జిల్లాకు కాళేశ్వరం జలాలు: హరీశ్‌రావు

వచ్చే దసరా నాటికి సిద్దిపేట జిల్లాకు కాళేశ్వరం జలాలు: హరీశ్‌రావు
x
Highlights

పండగ పూట ఆడబిడ్డకు చీర పెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌ది అని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్‌ లో బతుకమ్మ చీరల పంపిణీని మంత్రి...

పండగ పూట ఆడబిడ్డకు చీర పెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌ది అని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్‌ లో బతుకమ్మ చీరల పంపిణీని మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 3 లక్షల 65 వేల పై చిలుకు చీరలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే దసరా పండగనాటికి కాళేశ్వరం నీటిలో బతుకమ్మలు వేద్దామని హరీశ్‌రావు అన్నారు. 30 నుంచి 40 వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఉన్నా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్. కాంగ్రెస్, టీడీపీ వాళ్లు ఉంటే ఊళ్లలోకి నీళ్లు వచ్చేవా. 150 కి.మీ నుంచి నీళ్లు తెచ్చి సీఎం కేసీఆర్ ఆడపడుచుల కష్టాలు తీర్చిన్రు. కాంగ్రెస్ వాళ్లు ఉండగా ఒక్క పండుగకైనా బతుకమ్మ చీరలు ఇచ్చారా. దేశంలో రూ.2016 పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories