Top
logo

మరికాసేపట్లో తెలంగాణా క్యాబినెట్ విస్తరణ : కేటిఅర్, హరీష్ కి శాఖలివేనా?

మరికాసేపట్లో తెలంగాణా క్యాబినెట్ విస్తరణ : కేటిఅర్, హరీష్ కి శాఖలివేనా?
Highlights

మరికాసేపట్లో తెలంగాణా క్యాబినెట్ ని విస్తరించనున్నారు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్... ఇప్పటికే క్యాబినెట్ లో 12 మందికి ఛాన్స్ దక్కగా మరో ఆరుగురికి ఈ క్యాబినెట్ లో ఛాన్స్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి .

మరికాసేపట్లో తెలంగాణా క్యాబినెట్ ని విస్తరించనున్నారు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్... ఇప్పటికే క్యాబినెట్ లో 12 మందికి ఛాన్స్ దక్కగా మరో ఆరుగురికి ఈ క్యాబినెట్ లో ఛాన్స్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులో హరీష్ రావు , కేటీఆర్, గంగుల కమలాకర్ , పువ్వాడ అజయ్ కుమార్ , సబితా ఇంద్రారెడ్డి , సత్యావతి రాథోడ్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి .

ఏదైనా అనూహ్య పరిణామాలు జరిగితే ఈ జాబితాలో మార్పుండే అవకశాలు లేవు ... ఈ రోజు సాయింత్రం నాలుగు గంటలకు రాజ్ భవన్ లో గవర్నర్ చేతులమీదగా ప్రమాణస్వీకారం ఉంటుంది. అనంతరం వీరికి కేటాయించిన శాఖలను ముఖ్యమంత్రి వెల్లడిస్తారు . అయితే గతంలో మంత్రులుగా చేసిన హరీష్ రావు మరియు కేటిఅర్ కి ఎలాంటి శాఖలు దక్కనున్నాయి అన్న ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ కనిపిస్తోంది.

గతంలో కేటిఅర్ చేసిన ఐటి శాఖ, హరీష్ రావు చేసిన జలవనరులు శాఖలు ప్రస్తుతం సీఎం కేసీఆర్ దగ్గరే ఉన్నాయి. ఎక్కువ శాతం మళ్ళీ వీరికి ఇవే శాఖలు దక్కే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. కేటిఅర్ కి ఐటి శాఖతో పాటు పరిశ్రమలు, మున్సిపల్ శాఖ కేటాయించే అవకాశం ఉన్నట్టు సమాచారం . ఇక హరీష్ రావు కి జలవనరులు శాఖతో పాటు కీలకమైన ఆర్ధిక శాఖా కూడా కేటాయించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది . రేపటినుండి బడ్జెట్ సమావేశాలు ఉండడంతో ప్రమాణస్వీకారం అయిపోగానే వెంటనే శాఖలు వెలువరించే అవకాశం ఉంది .

Next Story