కోర్టుకు హాజీపూర్ మానవ మృగం

కోర్టుకు హాజీపూర్ మానవ మృగం
x
శ్రీనివాసరెడ్డి
Highlights

హాజీపూర్ వరుస హత్య కేసు విచారణ ఈనెల 26కు వాయిదా పడింది. నిందితుడు శ్రీనివాసరెడ్డి సహా 44 మంది సాక్షులను జడ్జి ఎదుట హజరు పరిచారు పోలీసులు. వారానికి ఐదు...

హాజీపూర్ వరుస హత్య కేసు విచారణ ఈనెల 26కు వాయిదా పడింది. నిందితుడు శ్రీనివాసరెడ్డి సహా 44 మంది సాక్షులను జడ్జి ఎదుట హజరు పరిచారు పోలీసులు. వారానికి ఐదు రోజులు చొప్పున ఇప్పటి వరకు 22 సార్లు విచారించింది కోర్టు. సాక్షులు చెప్పిన విషయాలపై నిందితుడు శ్రీనివాసరెడ్డిని న్యాయమూర్తి ప్రశ్నించారు. న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు నిందితుడు శ్రీనివాసరెడ్డి ఎలాంటి సమాధానం చెప్పలేదు. ఈ కేసులో తుది తీర్పుపై ఉత్కంఠ కొనసాగుతుంది.

అయితే దిశ నిందితులను ఎలా అయితే ఎన్‌కౌంటర్ చేశారో శ్రీనివాస్ రెడ్డిని అలానే ఎన్‌కౌంటర్ చేయాలని బాధితుల బంధువులు కోరుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌కు చెందిన శ్రావణి, మనీషా, కల్పనలపై నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి అఘాయిత్యాలకు పాల్పడి హత్యచేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష వేయాలని, తమ కుటుంబాలకు తగిన న్యాయం చేయాలని బాధిత కుటుంబసభ్యులు గవర్నర్‌ను కూడా కలిసిని విషయం తెలిసిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories