కరీంనగర్‌లో మందుగుండు పేలుడు.. భయంతో జనం పరుగులు

కరీంనగర్‌లో మందుగుండు పేలుడు.. భయంతో జనం పరుగులు
x
Highlights

కరీంనగర్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. గన్నేరువరం మండలం చాకలివానిపల్లి గ్రామ శివారులో మందుగుండు సామగ్రి పేలుడు సంభవించి ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

కరీంనగర్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. గన్నేరువరం మండలం చాకలివానిపల్లి గ్రామ శివారులో మందుగుండు సామగ్రి పేలుడు సంభవించి ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చాకలివానిపల్లి గ్రామ శివారులో ఉపాధి కూలీలంతా వారి వారి పనుల్లో పూర్తిగా నిమగ్నమయ్యారు. కాగా వారికి సమీపంలో ఉన్న ఓ వ్యవసాయ భూమిలో వారి పనులను చేస్తూ చెట్టు చుట్టూ ఉన్న కంచెను తొలగిస్తున్నారు. ఆ కంచెలో వారికి ఓ సంచి కన్పించింది.

కాగా ఆ సంచిలో మందుగుండు సామాగ్రి ఉన్న విషయం తెలుసుకోలేక ఆ సంచికి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నిప్పు పెట్టడంతో పేలుడు సంభవించింది. ఆ పేలుడుతో ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో కూలీలందరూ ఒక్కసారిగా భయపడి ఎక్కడి వాళ్లు అక్కడ పరుగు తీశారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ గాయపాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పిందనే అనుకోవాలి. కాగా ఈ విషయం గురించి పనికి వచ్చిన ఉపాధి కూలీలు గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజేందర్‌ దృష్టికి తీసుకురాగా ఆయన పోలీసుల సాయంతో ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. పేలుడు సంభవించిన సంచిలో 90 జిలిటిన్ స్టిక్స్, 50 డిటోనేటర్స్ ఉండడాన్ని గుర్తించారు.

దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అసలు ఈ మందుగుండు సామాగ్రి చాకలివానిపల్లికి ఎలా వచ్చిందన్నది తెలియాల్సి ఉందన్న కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు. మరోవైపు, ఆ సంచికి నిప్పు పెట్టిన వ్యవహారంపైనా పోలీసులు విచారణ జరుపుతున్నారు. స్థానికులే ఈ పని చేశారా లేదా అన్న అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎవరైనా తమకు అనవసరమైన మందుగుండును ఊరి బయట పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories