మూడో విడత పంచాయితీ పోలింగ్ ప్రారంభం.. ఏకగ్రీవమైనవి ఇవే

మూడో విడత పంచాయితీ పోలింగ్ ప్రారంభం.. ఏకగ్రీవమైనవి ఇవే
x
Highlights

తెలంగాణలో మూడో విడత గ్రామ పంచాయతీ పోలింగ్ ప్రారంభమైంది. పంచాయితీ ఎన్నికలు నేడు జరుగుతోన్న తుది (మూడో) విడతతో ముగియనున్నాయి. ఈ నెల 21న మొదటి, 25న...

తెలంగాణలో మూడో విడత గ్రామ పంచాయతీ పోలింగ్ ప్రారంభమైంది. పంచాయితీ ఎన్నికలు నేడు జరుగుతోన్న తుది (మూడో) విడతతో ముగియనున్నాయి. ఈ నెల 21న మొదటి, 25న రెండో విడత ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో ఇప్పుడు మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 3 వేల 504 గ్రామాల్లో ఎన్నిలు జరుగుతున్నాయి. మొదటి, రెండు దశల్లో మాదిరిగానే పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు తగిన చర్యలు తీసుకున్నారు. సున్నితమైన పోలింగ్‌ కేంద్రాల్లో భారీగా బలగాలను మోహరించారు.

బ్యాలెట్‌లో గుర్తుల కారణంగా రెండో విడతలో మూడు గ్రామాల్లో పోలింగ్‌ నిలిచిపోయింది. ఈ గ్రామాల్లో రీ పోలింగ్‌ ఇవాళే నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికలో 3,506 పంచాయతీలకు 11,664 మంది, 27,582 వార్డులకు 73,976 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పంచాయతీ పోలింగ్‌ ఉదయం 7 గంటలకు మొదలై మధ్యాహ్నం ఒంటిగంటకు ముగియనుంది. అదేరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలుపెట్టి సర్పంచ్, వార్డు సభ్యుల ఫలితాలు ప్రకటిస్తారు. కాగా మూడో విడతలో మొత్తం 4వేల 116 గ్రామాల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా, 577 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మరో 10 గ్రామాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories