కాల్ చేస్తే మందులు ఇంటికే...ఫ్రీ హోమ్ డెలివరీ

కాల్ చేస్తే మందులు ఇంటికే...ఫ్రీ హోమ్ డెలివరీ
x
Highlights

లాక్ డౌన్ నేపథ్యంలో మందులు దొరకక ఇబ్బందులు పడుతున్న వారికి ఓ స్వచ్ఛంద సంస్థ శుభవార్త తెలిపింది.

లాక్ డౌన్ నేపథ్యంలో మందులు దొరకక ఇబ్బందులు పడుతున్న వారికి ఓ స్వచ్ఛంద సంస్థ శుభవార్త తెలిపింది. సింగిల్ కాల్ చేస్తే చాలు మందులు ఇంటికే తీసుకొచ్చి ఇస్తామంటూ తెలిపింది. ముఖ్యంగా ఎలాంటి ఆసరాలేని వృద్ధులు, దివ్యాంగులకు ఉచిత సేవలను అందించడానికి ముందుకొస్తుంది. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో లాక్ డౌన్ విధించారని, ప్రజలు బయటికి వచ్చే పరిస్థితి లేనందుకు ఈ సేవలను ప్రారంభించామని యూత్‌ ఫర్‌ యాంటీ కరప్షన్‌ స్వచ్ఛంద సంస్థ తెలిపింది.

అత్యవసర పరిస్థితుల్లో మందులు కావలసిన వారు కాల్ చేస్తే వారి ఇంటికే మందులు చేరుస్తామని తెలిపారు. ఈ సేవలను కేవలం హైదరాబాద్ నగరం ప్రజలకు మాత్రమే కాకుండా నగర చుట్టు పక్కన ప్రాంతాల వారికి కూడా అందుబాటులో ఉంటాయన్నారు. వాట్సాప్‌ ద్వారా డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్‌, చిరునామా పంపిస్తే వెంటనే మెడికల్ నుంచి మందులు తీసుకొని వారికి అందిస్తున్నారు.

మెడికల్ సిబ్బంది ఇచ్చిన బిల్‌ ఆధారంగా నగదు చెల్లించాలని కోరుతున్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేవలం సేవా భావంతోనే దీన్ని ప్రారంభించామని వారు అంటున్నారు. వీరి సేవలను గురించి తెలుసుకున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు పల్నాటి రాజేందర్‌తో మాట్లాడారు. వారు చేస్తున్న సేవలను కొనియాడారు.

మందులు అవసరమైన వాళ్లు 9491114616, 814330 4148, 703747112, 9182339595, 8897736324 నంబర్లను సంప్రదించాలని సంస్థ అధ్యక్షుడు సూచించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మందుల కోరత ఉందని, దాని ద్వారా ఎంతో మంది ప్రాణాలను కొల్పోయే అవకాశం ఉందని సంస్థ వ్యవస్థాపకుడు తెలిపారు. అందుకే ఫోన్‌చేస్తే మందులు అందించే సేవను ఉచితంగా ప్రారంభించామన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories