Praja Darbar: రాష్ట్రంలో గవర్నర్ ప్రజాదర్బార్

Praja Darbar: రాష్ట్రంలో గవర్నర్ ప్రజాదర్బార్
x
Highlights

రాష్ట్ర ప్రజల సమస్యలను తెలుసుకుని, వారి సమస్యలకు సత్వర పరిష్కారం అందించాలని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రజల కోరిక మేరకు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని రూపొందించనున్నారు.

రాష్ట్ర ప్రజల సమస్యలను తెలుసుకుని, వారి సమస్యలకు సత్వర పరిష్కారం అందించాలని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రజల కోరిక మేరకు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని రూపొందించనున్నారు. నెల రోజుల్లో ఏర్పాట్లు పూర్తికానున్నాయని, ఆ తర్వాత గవర్నర్‌ ప్రజాదర్బార్‌ నిర్వహణ తేదీని ప్రకటిస్తారని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఈ కార్యక్రమాన్ని రాజ్‌భవన్‌లోని దర్బార్‌ హాల్‌లో నెలకోసారి నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించి వారి సమస్యలను పరిష్కరించనున్నారు. ఈ మేరకు గవర్నర్‌ ఇచ్చిన ఆదేశాలతో రాజ్‌భవన్‌ సచివాలయం ప్రజాదర్బార్‌ కార్యక్రమ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. అంతే కాక రాజ్‌భవన్‌ సచివాలయం అన్ని ప్రభుత్వ శాఖలతో అనుసంధానమై పనిచేసే విధంగా ఈ సాఫ్ట్‌వేర్‌కు రూపకల్పన చేస్తున్నారు. అదే ఫైల్‌ ట్రాకింగ్‌ సాఫ్ట్‌వేర్‌. ఈ సాఫ్ట్ వేర్ ద్వారా బాధితులు ఇచ్చిన దరఖాస్తులకు పరిష్కారం లభించిందా? అవి ఏ దశలో ఉన్నాయి? ఏ శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి? ఎన్ని రోజులుగా పెండింగ్‌లో ఉన్నాయి? ఇలాంటి విషయాలు తెలుసుకుంటారని తెలిపారు.

ఇకపోతే ప్రగతి భవన్‌ నిర్మాణం పూర్తైన తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రి కలవలేక పోతున్నామని, తమ సమస్యలను అధికారులు పరిష్కరించలేకపోతున్నారని ప్రజలు గవర్నర్ కు కోరారు దీంతో గవర్నర్‌ తమిళిసై రాజ్‌భవన్‌లో ప్రజాదర్బార్‌ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. కాగా గతంలో ఎన్నడూ గవర్నర్లు ప్రజాదర్బార్‌ నిర్వహించి ప్రజల నుంచి విజ్ఞప్తులు తీసుకున్న సందర్భాలు లేవని , ఈ కార్యక్రమం నిర్వహిస్తే ప్రజల్లో చెడు సంకేతాలు వెళ్తాయని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.

ఈ ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించడం వలన ఎంతో మంది సామాన్య ప్రజల కష్టాలు తీరుతాయని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. వారి సమస్యలను తీర్చాలంటూ ఎంతో మంది ప్రజలు అధికారుల వద్దకు వెళ్లి నప్పటికీ వారి సమస్యలు తీరడంలేదన ప్రజలు ఆవేదన వ్యక్తం చేసారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories