logo

ఖైరతాబాద్ గణేష్ తెలంగాణకు ప్రత్యేకం : గవర్నర్

ఖైరతాబాద్ గణేష్ తెలంగాణకు ప్రత్యేకం : గవర్నర్
Highlights

దేశంలోనే అతిపెద్ద వినాయకుడిగా ఖ్యాతి గాంచిన ఖైరతాబాద్ మహాగణపతి వద్ద సందడి నెలకొంది. 61 అడుగుల ఎత్తు , 12...

దేశంలోనే అతిపెద్ద వినాయకుడిగా ఖ్యాతి గాంచిన ఖైరతాబాద్ మహాగణపతి వద్ద సందడి నెలకొంది. 61 అడుగుల ఎత్తు , 12 చేతుల్లో ఆయుధాలు, 12 తలలు, వాటి వెనుక సూర్య భగవానుడు, దానిపైన 12 తలల సర్పం, ఏడు గుర్రాలతో ద్వాదశాదిత్యుడు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. వినాయక చవితి సందర్భంగా సోమవారం ఖైరతాబాద్‌లో శ్రీ ద్వాదశాదిత్య మహాగణపతి తొలిపూజ అందుకన్నాడు. ఖైరతాబాద్ శ్రీ ద్వాదశాదిత్యుడి తొలిపూజలో గవర్నర్ నరసింహన్ దంపతులు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితితో పాటు మంత్రి తలసాని, ఎమ్మెల్యే దానం గవర్నర్ దంపతులను శాలువాతో సత్కరించి సన్మానించారు. గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ.. ఖైరతాబాద్ గణేష్ పూజ తెలంగాణకు ఎంతో ప్రత్యేకమైనది అని పేర్కొన్నారు. గత 9 సంవత్సరాలుగా ప్రతి ఏడాది ఇక్కడికి రావడం అలవాటుగా అయిపోయింది. ఈ గణేశుడిని పూజిస్తే తెలంగాణకు ఎప్పుడు కూడా ఏ విఘ్నం రాదు అని తన నమ్మకమని చెప్పారు.


లైవ్ టీవి


Share it
Top