Telangana: 12 ఏళ్లు పైబడిన డీజిల్‌ వాహనాలపై ప్రభుత్వం ఆంక్షలు

Telangana: 12 ఏళ్లు పైబడిన డీజిల్‌ వాహనాలపై ప్రభుత్వం ఆంక్షలు
x
Highlights

ప్రస్తుతం ఢిల్లీ వాసులు ఎదుర్కొంటున్న వాయు కాలుష్య సమస్య హైదరాబాద్ నగరాన్ని కూడ తాకనుంది. రాష్ట్రంలో వాహనాల సంఖ్య పెరిగిపోతున్న కొలది కాలుష్యం కూడా పెరిగిపోతుంది.

ప్రస్తుతం ఢిల్లీ వాసులు ఎదుర్కొంటున్న వాయు కాలుష్య సమస్య హైదరాబాద్ నగరాన్ని కూడ తాకనుంది. రాష్ట్రంలో వాహనాల సంఖ్య పెరిగిపోతున్న కొలది కాలుష్యం కూడా పెరిగిపోతుంది. దీంతో ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తడమే కాకుండా, ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. అంతే కాకుండా రానున్న రోజుల్లో ఇంధనం కొరత కూడా రాబోతుంది. ఇక ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలోనే కొత్త డీజిల్‌ వాహనాలపై ఆంక్షలు విధించేందుకు సిద్దం అవుతుంది. ఇందుకు సంబంధించి ప్రస్తావనను ఇటీవల జరిగిన ఓ సమావేశంలో సీఎం కేసీఆర్ తీసుకొచ్చారు. నగరాన్ని వాహనాల పొగ ఉక్కిరిబిక్కిరి చేయకముందే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న సీఎం కేసీఆర్‌.. మొక్కలు పెంచడంతోపాటు డీజిల్‌ వాహనాలను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

హైదరాబాద్‌ నగర రహదారులపై దాదాపు 15 లక్షల డీజిల్‌ వాహనాలు తిరుగుతున్నాయి. దీంతో పట్టనంలో వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం పెరిగిపోతుంది. దీంతో కాలుష్యాన్ని అరికట్టడానికి 12 ఏళ్లు తిరిగిన డీజిల్‌ వాహనాలను నిషేధించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. అంతే కాద డీజిల్ వాహనాలపై పన్ను శాతాన్ని కూడా పెంచే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం వాహనదారులు ఇప్పటికే 2 శాతం పన్నును చెల్లిస్తున్నారు. ఇక ఇదే సమయంలో బ్యాటరీ వాహనాలకు పన్నులు మినహాయించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.

దీంతో వాహనదారులు బ్యాటరీ వాహనాల పట్ల ఆకర్షితులయ్యే అవకాశం ఉందని తెలిపారు. దీనికి సంబంధించి ప్రతిపాదనలు త్వరలో రవాణాశాఖకు ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి తెలంగాణ మోటారు వాహన చట్టానికి సవరణలు చేయాలని రవాణాశాఖ భావిస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలో గతంలో రవాణాశాఖ చేసిన ప్రతిపాదనల పునఃసమీక్ష, నిపుణులు ఇచ్చిన నివేదికలోని వివరాల ఆధారంగా కొత్త ప్రతిపాదనలు ఇవ్వడం వంటి అంశాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని నిర్ణయించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories