ఇస్త్రీ పెట్టెల్లో 9కిలోల బంగారం!

ఇస్త్రీ పెట్టెల్లో 9కిలోల బంగారం!
x
Highlights

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు భారీగా బంగారం పట్టుకున్నారు. నిన్న రాత్రి దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద కస్టమ్స్ అధికారులు 9.2...

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు భారీగా బంగారం పట్టుకున్నారు. నిన్న రాత్రి దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద కస్టమ్స్ అధికారులు 9.2 కిలోల బంగారంను గుర్తించి పట్టుకున్నారు. దీని విలువ సుమారు రూ.3.46 కోట్లు ఉంటుందని కస్టమ్స్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. నాలుగు ఇస్త్రీ పెట్టెల్లో ఈ బంగారాన్ని తరలిస్తుండగా పక్కా సమాచారంతో కస్టమ్స్‌ అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకొని బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories